విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలి.
(నమస్తే మానుకోట న్యూస్-గూడూరు)
విద్యార్థులు ఉన్నత చదువులు చదివి,ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని, నిజ జీవితంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు గా స్థిరపడాలని గుండంరాజపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ప్రథానోపాధ్యాయులు రమేష్ అన్నారు.ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం గుండంరాజపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో గురువారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు,అధికారులుగా విధులు నిర్వహించారు.ప్రతిభావంతులైన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.

