(నమస్తే మానుకోట న్యూస్-దంతాలపల్లి) దళారులు,వ్యాపారస్తుల మోసాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం మార్కెట్ ముందు శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న రైతులను రైతు సంఘం నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కేంద్ర శివారు బొడ్లాడ క్రాస్ రోడ్డు వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏఐకెఎంఎస్ డివిజన్ అధ్యక్షులు ఊడుగుల లింగన్న మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం రైతాంగ సమస్యలు పరిష్కరించకుండా. రైతులను అప్పులపాలు చేసిందని మా ప్రభుత్వం ఏర్పడితే రైతులకు మేలు జరుగుతుందని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా, మార్కెట్లలో వ్యాపారులు,దళారులు కుమ్మక్కై రైతులను దోపిడీ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందని మండి పడ్డారు. శాంతియుతంగా మార్కెట్ ముందు ధర్నా నిర్వహిస్తున్న రైతులను, రైతు కూలీ సంఘం నాయకులను అరెస్ట్ చేయడం సరికాదని అన్నారు. అక్రమ అరెస్టు ను తీవ్రంగా ఖండిస్తూ , వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

