(నమస్తే మానుకోట న్యూస్-గూడూరు)
దేశంలో బాలిక విద్యకు బాటలు పరిచిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో విద్యాభివృద్ధికి అందరూ కృషి చేయాలని టి పి టి ఎఫ్ గూడూరు మండల అధ్యక్షులు సోమ రవి అన్నారు. టి పి టి ఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మార్చి 10 న నిర్వహించనున్న సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ-మహిళా సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ఈరోజు జడ్పీహెచ్.ఎస్.బాయ్స్ గూడూరు పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చీర బిక్షపతి సమక్షంలో కరపత్రం ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ శతాబ్దన్నర కాలానికి ముందే విద్యను పంచడానికి ఎన్నో అవరోధాలను దాడులను ఎదుర్కొన్న ధీరవనిత అని కొనియాడారు. కేవలం విద్య కోసమే కాకుండా ఆనాడు సమాజంలో నెలకొని ఉన్న సాంఘిక దురాచారాలను గుర్తు చేశారు. అలాంటి గొప్ప వాళ్ళ అధ్యయనం, విగ్రహాలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయని పూలే విగ్రహాన్ని నెలకొల్పడం అభినందనీయమని అన్నారు. విగ్రహం నెలకొలపడం కాకుండా వారి ఆశయ సాధనకు ఉపాధ్యాయ లోకం పనిచేయాలని కోరారు. ఈనెల 10న విగ్రహావిష్కరణ సభ మహిళా సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.. .ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ మండల అధ్యక్షులు సోమ రవి,జిల్లా నాయకులు మహబూబ్ అలీ, ఊకె శ్రీనివాస్,మండల నాయకులు మేడ జగ్గయ్య, నర్సయ్య, ఆదినారాయణ,శ్రీనివాస రావు,అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

