(నమస్తే మానుకోట న్యూస్-బయ్యారం)
ఖమ్మం మార్కెట్లో రైతులను అనేక రకాలుగా దోపిడీ చేస్తున్న దళారుల. వ్యాపారస్తుల మోసాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం మార్కెట్ ముందు శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న రైతులను రైతు సంఘం నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బయ్యారం మండల వెంకట్రాంపురంలో ప్రభుత్వ దిష్టిబొమ్మని దగ్ధం చేశారు.ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి నందగిరి వెంకటేశ్వర్లు. మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం రైతాంగ సమస్యలు పరిష్కరించకుండా. రైతులను అప్పులపాలు చేసిందని మా ప్రభుత్వం ఏర్పడితే రైతులకు మేలు జరుగుతుందని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం. అనేక వాగ్దానాలు చేసింది అధికారానికి వచ్చిన తర్వాత రైతాంగ సమస్యలు పరిష్కరించకుండా ఉన్న నేపథ్యంలో మార్కెట్లలో వ్యాపారస్తులు. దళారులు మిలాకతై రైతులను దోపిడీ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితుల్లో రైతులు శాంతియుతంగా మార్కెట్ ముందు తమ సమస్యల్ని పరిష్కరించాలని ధర్నా నిర్వహిస్తున్న రైతులను .అఖిలభారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వరరావు గారిని. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మదన్నను ,అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై ప్రకాష్ .వెంకట్రాంరెడ్డి. ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు మందుల రాజేంద్రప్రసాద్. ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ. పి ఓ డబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు వై జానకి. పి వై ఎల్ .పి డి ఎస్ యు నాయకులు ఉమాశంకర్. సుభాన్. ఐ ఎఫ్ టి నాయకులు వెంకన్న తదితరులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని. తీవ్రంగా ఖండిస్తున్నాం. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ నిరసన కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలి సంఘం మండల ప్రధాన కార్యదర్శి తోకల వెంకన్న. రామచంద్ర మురళి. వల్లాల బిక్షం. తేజావత్ హుస్సేన్.అజ్మీర తేజ. వల్లాల మధు మా లోతు బిక్షం. కెసుజాత. దిడ్డి అండమ్మ. శ్రీహరితదితరులు పాల్గొన్నారు.


