గడచిన ఐదేళ్ల కంటే నాఅవసరం ఇప్పుడే ఎక్కువగా ఉంది.
ఆపదలో కార్యకర్తలకు ఆడబిడ్డనై తోడుంటా.
ప్రజలు రెడ్యానాయక్ పై కోపంగా లేరు...వారి అబద్దాలు నమ్మే కాంగ్రెస్ కు ఓటేశారు.
ఓడినా.. గెలిచినా ప్రజల్లో ఉండేవాళ్ళం..ప్రజలు తప్పక ఆదరిస్తారు-
ప్రశ్నించే గొంతుకై ప్రభుత్వాన్ని నిలదీయాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందాలి.
రాబోయే ఎన్నికల్లో
మరో మారు ఎంపీగా తన గెలుపు తధ్యం
-ధీమా వ్యక్తం చేసిన ఎంపీ కవిత.
నమస్తే మానుకోట న్యూస్ నర్సింహులపేట
గడచిన ఐదేళ్లలో ప్రజలకు నా అవసరం చాలా తక్కువగా ఉందని ,కానీ ఇపుడు నా అవసరం చాలా ఎక్కువగా ఉంటుందని ,ఏ ఆపద వచ్చినా కార్యకర్తలకు మీ ఆడబిడ్డలా నీడై తోడుంటానని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత అన్నారు.మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో గురువారం ఆపార్టీ మండల అధ్యక్షుడు మైదం దేవేందర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ ప్రజలంతా రెడ్యానాయక్ పై కోపంతోనో ,రెడ్యానాయక్ పనిచేయలేదనో కాకుండా కాంగ్రెస్ పార్టీ చెప్పిన అబద్దాలను నమ్మి మాత్రమే వారికి ఓటువేశారని ఎంపీ కవిత అన్నారు. గ్రామాల్లో ముఖ్య కార్యకర్తలు,నాయకులు సమన్వయం తో చర్చించుకుని ,రానున్న పార్లమెంట్ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని,కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ,ప్రజలు ఆశపడ్డ ప్రతీ పథకాన్ని సాధించేందుకు ప్రజల పక్షాన కొట్లాడటానికి ఓ ప్రశ్నించే గొంతుక కావాలని,అది మాలోత్ కవిత ఎంపీగా గెలుపించుకుంటేనే సాధ్యమవుతుందని ప్రజలకు వివరించాలని సూచించారు.గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలుగా ఓటమి పొందినా...స్వంత పార్టీ అధికారంలో లేకపోయినా ఎంపీలుగా గెలుపొందారని అదే దారిలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఓడినా గెలిచినా ప్రజల్లో ఉండే మనుషులమని,ప్రజలు తప్పక ఆదరిస్తామని అన్నారు.ప్రజలు సోషల్ మీడియా ద్వారా ప్రతీది గమనిస్తున్నారని, కాంగ్రెస్ కు ఓటువేసినందుకు భాదపడుతున్నారని గడచిన 9 ఏండ్లలో ఏనాడూ ఎండిన పొలాలు, చెరువులు చూడలేదని ,కాంగ్రెస్ కు ఓటువేసి తప్పుచేశామని ,రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరోమారు తప్పు జరుగకుండా వారికి ఓటు వేయకుండా ఉండాలని ప్రజలు నిర్ణయించుకున్నారని అన్నారు.కాబట్టి ప్రజల మనుసుకు దగ్గరై వారి ఓటును అభ్యర్థించాలని సూచించారు.
మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ మాట్లాడుతూ...
డోర్నకల్ నియోజకవర్గంలోని ఆకేరు, పాలేరు,మున్నేరు నదిపై 40 చెక్ డ్యాములను నిర్మించానని, నీరు వాటిపై పొంగిపొర్లేదని ప్రస్తుతం తాగు, సాగు నీరు అందించే దిక్కేలేదని మాజీ ఎమ్మెల్యే డి.ఎస్ రెడ్యా నాయక్ అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రైతులను పట్టించుకునే నాథుడే లేడని అన్నారు. కేసీఆర్ అప్పు తెచ్చి కూడా సంక్షేమ పథకాలు
లభ్థిదారులకు అందించారని ,గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే నిలదీయాలని సూచించారు..ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలోత్ కవితను గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జాటోత్ దేవేందర్,రవి నాయక్,ఎల్ మధుసూదన్ రెడ్డి, సుధీర్ రెడ్డి, కాలసాని వెంకట్ రెడ్డి,బొల్లం రమేష్ ,మిర్యాల వెంకన్న,కొత్త రవీందర్ రెడ్డి, ఎండి ఖాజామీయ, నరసింహారెడ్డి, పాతూరి మధు రెడ్డి,రమేష్ రెడ్డి ,చిమ్ముల వెంకట్ రెడ్డి,అజ్మీర నాయకి, మేకల వెంకన్న ,అనిల్,మంచాల శ్రీశైలం,వీరూ నాయక్ , సురేష్, వంశీ నాయక్, మారపంగు వీరన్న,వివిధ గ్రామాల మాజీ సర్పంచులు,మాజీ ఎంపీటీసీలు,గ్రామ పార్టీల అధ్యక్షులు,రైతు సమన్వయ సమితి సభ్యులు,యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

.jpg)
.jpg)