Type Here to Get Search Results !

"మార్చి16 వ, తేదీన జాతీయ లోక్ అదాలత్" జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్

 





నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్


జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు మన మహబూబాబాద్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీన శనివారం రోజున జాతీయ లోక్ ఆదాలత్ కార్యక్రమాన్ని మహబూబాబాద్ జిల్లా కోర్టులో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని, జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు చైర్మన్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ, శ్రీ పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలియజేశారు.


వివిధ కేసులలో కక్షిదారులు తమతమ కేసులను రాజీ కుదుర్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ జాతీయ లోక్ ఆదాలత్ కార్యక్రమంలో రాజీ పడదగు క్రిమినల్, సివిల్, భూతగాదా,మోటార్ వెహికల్ యాక్సిడెంట్,వివాహ కుటుంబ తగాదా కేసులు, బ్యాంకు, చెక్ బౌన్స్, ఎలక్ట్రిసిటీ, చిట్ ఫండ్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇన్సూరెన్స్,ఎక్సైజ్, విద్యుత్ చోరీ(దొంగతనాలు), ట్రాఫిక్, ఈ చలాన్ కేసులు,ఇతర రాజీ పడదగు అన్ని కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు.ఈ జాతీయ లోక్ అదాలథ్ లో రాజీ పడదగు కక్షిదారులు తమ తమ కేసుల వివరాలను సంబంధిత కోర్టులలో తెలియపరచి రాజీ కుదుర్చుకొని ప్రశాంతమైన జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని, కోర్టుల చుట్టూ తిరిగి ఎంతో విలువైన తమ సమయాన్ని (కాలాన్ని) మరియు డబ్బును కోల్పోకుండా చక్కని జీవనాన్ని కొనసాగించాలని తెలిపారు. రాజీపడదగు కక్షిదారులు తమ న్యాయవాదులతో నేరుగా కోర్టులో హాజరై తమ కేసులను పరిష్కరించుకొని జాతీయలోక్ అదాలత్ విజయవంతం చేయుటకు గాను ఇప్పటికే పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఇన్సూరెన్స్ అధికారులు, న్యాయవాదులతోనూ, వేరువేరుగా సమావేశాలు నిర్వహించి అధిక కేసుల పరిష్కార దిశగా చర్యలు చేపట్టమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా గుర్తించబడిన కేసులలో మొత్తం పెండింగ్ కేసులను పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలియజేసారు.ఇందులకు గాను మొత్తం ఐదు లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు జరిగిన జాతీయలోక్ అదాలత్ లను విజయవంతం చేయుటకు పోలీస్ అధికారులు, న్యాయవాదులు ప్రింట్ మీడియా,ఎలక్ట్రానిక్ మీడియా పాత్ర అనిర్వచినియమని కొనియాడారు. లోక్ అదాలత్ ను వినియోగించుకునే విషయమై ఎటువంటి సలహాలు

సందేహాలకు లేదా ఏదేని న్యాయ సహాయం కొరకైనను న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించి ఉచిత న్యాయ సలహాలు,సూచనలు పొందగలరని తెలిపారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.