నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్
ఈ రోజు కలెక్టరేట్ ప్రధాన సమావేశం మందిరంలో మహబూబాబాద్ ఎస్టి-16, నియోజకవర్గ, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్, అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు, రెవెన్యూ) లెనిన్ వత్సల్ టోప్పో, డేవిడ్, అడిషనల్ ఎస్పీ చెన్నయ్య, లతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు,
ఈ సందర్భంగా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్, మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికలు నిర్వహించుటకు షెడ్యూల్ ప్రకటించినందున,
పార్లమెంట్ పరిధిలోని (7) నియోజకవర్గాలలో మొత్తం ఓటర్లు (1528419), మందికాగా అందులో (745554) పురుష ఓటర్లు, (781339) మహిళా ఓటర్లు, (105) థర్డ్ జండర్స్ ,(1421) సర్వీస్ ఓటర్లు, ఉన్నారు,
పార్లమెంట్ పరిధిలోని (1158) ప్రాంతాలలో (1783) పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని,
జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో (7) చెక్ పోస్టులు, ఏర్పాటుచేసి, విఎస్టి , ఎస్ఎస్ టి, బృందాలు నిరంతరం పర్యవేక్షణ చేస్తుందన్నారు,
ఎన్నికల నిర్వహణకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎం సి ఎం సి, ఎక్స్పెండేచర్, మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ, స్వీఫ్ ఆక్టివిటీస్ , లకు సంబంధించి తదితర (16) మంది నోడల్ అధికారులను నియమించామన్నారు,
అన్ని పోలింగ్ కేంద్రాలలో పూర్తిస్థాయిలో వసతులు కల్పించామని, పోలింగ్ పర్సన్స్ కి ఇప్పటికే రెండు దఫాలలో శిక్షణ తరగతులు నిర్వహించామని, జిల్లా ఎన్నికల కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిరంతరం సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు, ఏదైనా ఫిర్యాదులు సమస్యల పరిష్కారం కోసం సివిజి, యాప్ (1950) ద్వారా తెలిపితే పరిష్కరిస్తామన్నారు,
రాజకీయ పార్టీల ప్రచార, సభల అనుమతులు సకాలంలో సరైన దరఖాస్తు చేసుకుంటే, ఎన్నికల నిబంధనల ప్రకారం అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు,
సోషల్ మీడియా లలో ఫేక్ న్యూస్ లు సృష్టిస్తే ఎన్నికల సంఘం గైడ్లైన్స్ ప్రకారము చర్యలు తీసుకుంటామన్నారు,
జిల్లాలో 16 - మహబూబాబాద్ (ఎస్టీ) పార్లమెంటు లోక్ సభ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధంగా ఉందని జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు,
అనంతరం మినీ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం) పోలింగ్ కేంద్రాలు, రాజకీయ పార్టీల ప్రతినిధుల పర్యటనలు, సభల అనుమతులు, ఎన్నికల నిర్వహణకు సంబంధించి తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు,
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నుండి సురేష్ నాయుడు, బిఆర్ఎస్ పార్టీ నుండి మార్నేని వెంకన్న, టిడిపి నుండి రామారావు, ఆర్డిఓ అలివేలు, ఎన్నికల సూపర్డెంట్ పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.


