(నమస్తే మానుకోట న్యూస్-నర్సింహులపేట)
నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నర్సింహులపేట మండల ఎస్సై జి.సతీష్ హెచ్చరించారు.మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని పలు గ్రామాల్లో ఆకేరు వాగు విస్తరించి ఉంది.ఈ వాగు పరివాహక గ్రామాలైన జయపురం , కౌసల్యదేవి బ్రిడ్జి ప్రాంతల్లో ఏర్పాటు చేయబడి ఉన్న ఇటుక బట్టీల వద్ద ,ఏటిలోకి వాహనాలు ప్రయాణించడానికి అనువుగా మార్గాలను ఏర్పాటు చేసుకొని ఎలాంటి అనుమతులు లేకుండా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, ఇసుక అక్రమ రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న నాలుగు ట్రాక్టర్లను స్వాధీన పరుచుకుని స్టేషన్ కు తరలించినట్లుగా ఎస్ఐ తెలిపారు.ఇట్టి ట్రాక్టర్లను కౌసల్యదేవి పల్లి ,బొజ్జన్న పేట,నెల్లికుదురు గ్రామాలకు చెందిన వాహనాలుగా ప్రాథమికంగా గుర్తించామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు.



