ఆలయ నిర్మాణానికి విరాళం అందజేసిన యువకుడు.
(నమస్తే మానుకోట న్యూస్-చిన్నగూడూరు)
తమ గ్రామంలో నిర్మించే తలపెట్టిన ఆలయ నిర్మాణానికి ఓ యువకుడు 10000 రూపాయల విరాళాన్ని అందజేసి గ్రామస్తుల మన్ననలు పొందుతున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం గుండంరాజపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. సాధారణంగా ఈ రోజుల్లో దేవుడన్నా ,ఆలయాలన్నా పెద్దగా పట్టింపులేని యువకులను చూస్తుంటాం..కానీ ఇటీవల గ్రామంలోని కొంతమంది కంఠమహేశ్వర ఆలయాన్ని నిర్మించాలని భావించి,తమ వృత్తి దారులతో చర్చించినారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన కుంట శ్రీను అనే యువకుడు కంఠమహేశ్వర ఆలయ నిర్మాణానికి పదివేల రూపాయల విరాళాన్ని అందించి యువతకు ఆదర్శంగా నిలిచాడు కాగా శ్రీను ను గ్రామస్తులు అభినందిస్తున్నారు.

