నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్
వేసవికాలం దృష్ట్యా ప్రజలకు త్రాగునీరు అందించడంలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని *జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం నాడు, కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో తో కలిసి జిల్లాలోని (461) గ్రామపంచాయతీ, మహబూబాబాద్, డోర్నకల్, మరిపెడ, తొర్రూర్, మున్సిపల్ ఏరియాలలో ప్రజలకు అందిస్తున్న త్రాగునీరు పై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా (461) గ్రామపంచాయతీలు మున్సిపల్ పరిధిలో క్షేత్రస్థాయిలో ప్రజలకు త్రాగునీరు (మిషన్ భగీరథ) ద్వారా అందించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, ఎక్కడైతే నీటి కొరత ఉన్నచోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం తాగునీటి సరఫరా అందించాలనీ సమ్మర్ యాక్షన్ ప్లాన్ ను రూపొందించాలని, తాగునీటి సరఫరా నిరంతరం అందించాలని, త్రాగునీరుకు ఇబ్బంది లేకుండా బోరు బావులు,హ్యాండ్ పంపులు మరమ్మతులు చేపట్టాలని, నీటి వనలరులపై నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ట్రైబల్, వెనుకబడిన తరగతులు , తదితర వసతి గృహాల్లో నిరంతరం త్రాగునీరు అందించాలని అన్నారు.
ఈ సమావేశంలో మిషన్ భగీరథ (గ్రిడ్) ఈఈ సురేందర్, డిపివో హరి ప్రసాద్, మిషన్ భగీరథ (ఇంట్రా) కృష్ణారెడ్డి, డోర్నకల్, తొర్రూర్, మరిపెడ, మహబూబాబాద్, మున్సిపల్ కమిషనర్లు నరేష్ రెడ్డి, శాంత కుమార్, వెంకటేశ్వర్లు, రవీందర్, బిసి, ఎస్సి, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ నరసింహ స్వామి ,బాలరాజు, ఎర్రయ్య, తదితరులు పాల్గొన్నారు.


