నమస్తే మానుకోట న్యూస్
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పోషణ పక్షోత్సవాలలో భాగంగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట సెక్టార్ లోని వీరారం గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ్ పక్షోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐసిడిఎస్ సూపర్వైజర్ మిడత పల్లి శ్రీలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ శ్రీలత మాట్లాడుతూ చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని గర్భిణీ స్త్రీలు బాలింతలు తప్పనిసరిగా తీసుకోవాలని చిరుధాన్యాలతో కూడిన ఆహారం తీసుకోవడం వలన పోషక లభిస్తాయని తద్వారా ప్రవేశపెట్టిన కూడా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.పోషక విలువలతో కూడిన ఆహారమును పిల్లలకు పిల్లలకు అందించాలని కోరారు. విటమిన్ లోపం లేకుండా పచ్చి కూరగాయలు ఆకుకూరలతో మంచి ఆహారాన్ని తీసుకోవాలని కోరారు. ఆహారపు అలవాట్లు, పోషిక ఆహారాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ శ్రీవాణి, జి. కవిత, బి. కవిత, అచ్చమ్మ, హీరా, లక్ష్మి హెల్పర్ నాగలక్ష్మి, ప్రీ స్కూల్ పిల్లలు, గర్భిణీ బాలింతలు, గ్రామ మహిళలు పాల్గొన్నారు.

