మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో ఎన్ఆర్ఈజిఎస్ పథకంలో చేపట్టిన నిర్మాణాలకు బిల్లులు మంజూరు చేయాలని మహబూబాబాద్ ఎంపి మాలోత్ కవిత కోరారు. ఈ సందర్భంగా ఎంపి కవిత మాట్లాడుతూ మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో నిర్మించిన వైకుంఠధామం,రైతు వేదికలు,జిపి బిల్డింగ్స్ కి పూర్తి బిల్లులు మంజూరు కాకుండానే కంప్లీట్, కంప్లీటెడ్ స్టేటస్ లో పడిన వాటిని తిరిగి రీఓపెన్ చేసి తిరిగి మంజూరు చేయాలని ఢిల్లీలోని కృషి భవన్ లో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి శైలేష్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందజేసినట్లుగా తెలిపారు.కార్యక్రమంలో జిల్లా సర్పంచుల ఫోరం మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ బోడ లక్ష్మణ్ నాయక్ పాల్గొన్నారు.

