గ్రామపంచాయతీ విధులను ప్రత్యేక అధికారులు సమర్థవంతంగా చేపట్టి ప్రజల మన్నన పొందాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ అన్నారు.
మంగళవారం సమీకృత జిల్లా అధికారుల భవన సముదాయం సమావేశం మందిరంలో లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారుల శిక్షణ కార్యక్రమం లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక అధికారులు గ్రామపంచాయతీ విధులను పారదర్శకంగా జవాబుదారీతనంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజల మన్నన పొందాలన్నారు.
ముందుగా గ్రామపంచాయతీ సిబ్బందిని సమావేశపరిచి కార్యకలాపాలను సిబ్బంది విధులను అడిగి తెలుసుకుంటూ అవగాహన పొందాలన్నారు.
ఈనెల 7వ తేదీ నుండి 14వ తేదీ వరకు నిర్వహించే సమ్మర్ స్పెషల్ డ్రైవ్ ను ప్రజల భాగస్వామ్యంతో సమర్థవంతంగా చేపట్టాలన్నారు.
ప్రధానంగా త్రాగునీరు పై దృష్టి పెట్టాలని రోజువారీగా సరఫరా జరగాలన్నారు.
అదేవిధంగా తడి చెత్త పొడి చెత్త సేకరణ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ నిరంతరంగా చేపట్టాలని అధికారులకు సూచించారు.
జనన మరణాలు వివాహ రిజిస్ట్రేషన్లు రిజిస్టర్లలో నమోదు చేస్తూ లేఅవుట్స్ పై ఆన్లైన్ దరఖాస్తులను పర్యవేక్షించాలన్నారు గ్రామపంచాయతీ లలో ప్లాస్టిక్ వస్తువులు కనిపించకుండా సిబ్బందిని అప్రమత్తం చేయాలని విక్రయాలు జరగకుండా తనిఖీలు చేపట్టాలన్నారు.
మండల పంచాయతీ అధికారులు ఎంపీడీవోలు సలహాలు సూచనలు తీసుకోవాలన్నారు ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న వాటిపై దృష్టి పెట్టాలని సిబ్బంది పనితీరు పెంచాలన్నారు.
ఈ శిక్షణ తరగతుల కార్యక్రమంలో జడ్పీ సీఈవో రమాదేవి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సన్యాసయ్య పంచాయతీ అధికారి హరిప్రసాద్ ఇతర జిల్లా అధికారులు గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.



