![]() |
| (సమావేశంలో మాట్లాడుతున్న ఏజిఎం చంద్రశేఖర్) |
(నమస్తే మానుకోట-నరసింహులపేట)
మహిళలు స్వయంకృషితో ఆర్థికంగా ఎదగాలని అందుకు నాబార్డు సేవలు వినియోగించుకోవాలని నాబార్డు ఏజిఎం చంద్రశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం నర్సింహులపేట మండలం పడమటిగూడెం గ్రామంలో రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో మహిళలకు గత వారం రోజులుగా నిర్వహిస్తున్న అవగాహన సదస్సులకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాబార్డ్ ఏజీఎం చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రామంలోని మహిళలు నైపుణ్యం ఉన్న పనులు, నైపుణ్యత లేకుండా పరిజ్ఞానంతో చేసే పనులను చేపట్టే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే వారి యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని , తద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. గ్రామంలోని 30 మంది మహిళలకు నాబార్డ్ వారి సహకారంతో నరసింహులపేట ఎస్బిఐ బ్యాంకు సహకారంతో మహిళలకు తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేయాలని ఎస్బిఐ మేనేజర్ కు సూచించారు .ఈ కార్యక్రమంలో నరసింహుల పేట ఎస్.బి.ఐ బ్రాంచ్ మేనేజర్ దిలీప్ కుమార్, పశువైద్యాధికారి వినోద్ , మరియు సాయి స్వచ్ఛంద సేవ సంస్థ సీఈవో వెంకన్న,మరియు నరసింహులపేట రైతు ఉత్పత్తిదారుల సంఘం సీఈవో పర్శయ్య , సంస్థ డైరెక్టర్లు భూక్యా వీరు నాయక్ ,మంచాల శ్రీశైలం , మాజీ ఎంపిటిసి రమేష్ రెడ్డి ,గ్రామ పెద్దలు వెంకట్ రెడ్డి , దారం వేదయ్య , అవీలేని వెంకన్న,బోల్ల నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

