ఆపదలో ఉన్న వారిని ఆదుకుందాం:ఎస్సై జి.సతీష్
![]() |
| (చిన్నారిని ఆసుపత్రికి తరలిస్తున్న ఎస్సై సతీష్ మరియు సిబ్బంది ) |
(నమస్తే మానుకోట న్యూస్-నర్సింహులపేట) ఆపదలో ఉన్నవారిని ఆదుకొనేందుకు మన వంతుగా కృషిచేయాలని నర్సింహులపేట ఎస్సై జి.సతీష్ అన్నారు. ఈ సందర్భంగా నర్సింహులపేట మండలం పడమటిగూడెం గ్రామంలో ఓ బాలికకు ఫిట్స్ వచ్చి, అపస్మారక స్థితికి చేరుకోవడంతో అటువైపుగా వెళ్లిన ఎస్సై తక్షణ వైద్యం కోసం తన పోలీసు వాహనంలో ఆస్పత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్న ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే. మరిపెడ మండలం గుండెపుడి గ్రామానికి చెందిన స్వాతి- ప్రభాకర్ దంపతుల నాలుగేళ్ల కూతురు భానుశ్రీ తనతల్లి స్వాతితో నర్సిం హులపేట మండలంలోని పడమటిగూడెం గ్రామంలో అమ్మమ్మ బొబ్బలి లింగమ్మ ఇంటికి రెండురోజుల క్రితం వచ్చారు. అప్పటికే జ్వరంతో ఉన్న భానుశ్రీ ని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళే క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం ఫిట్స్ వచ్చాయి. గమనించిన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా స్థానికులు ఒక్కసారిగా స్టేజీ వద్ద గుమిగూడారు,అదే సమయంలో తొర్రూరు నుంచి నర్సింహులపేటకు వస్తున్న ఎస్సై సతీష్ గమనించి, వాహనాన్ని ఆపి, విషయం తెలుసుకున్నాడు. చలించిన ఎస్సై పోలీసు వాహనంలో భానుశ్రీని ఎక్కించి తొర్రూరు ఆస్ప త్రికి తరలించాడు. వేరొకరి ద్విచక్రవాహనంపై ఎస్సై సతీష్ నర్సింహులపేట పోలీసుస్టేషన్ కు చేరుకున్నాడు.ప్రాణాపాయం లో ఉన్న తన బిడ్డకు చేసిన ఎస్సై సహకారానికి కుటుంబ సభ్యులు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, ఆస్పత్రికి తరలించిన భానుశ్రీకి ఎలాంటి ప్రమాదంలేదని వైద్యులు తెలిపారు.

