నర్సింహులపేట
గ్రామ సర్పంచుల
ఐదేళ్ల పదవీకాలం ఈరోజుతో ముగిసింది. వీరంతా
గ్రామాభివృద్ధిలో తమదైన ముద్ర వేశారు. కేంద్ర రాష్ట్ర
ప్రభుత్వాల నుంచి మంజూరైన నిధులతో పనులను
చేపట్టారు. నూతన పంచాయతీరాజ్ చట్టంలో
నిబంధనల మేరకు నడుచుకుంటూ పల్లెల్లో నిత్యం
పచ్చదనం, పారిశుద్ధ్యం ఉండేలా చర్యలు
తీసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన
వారికి అందించడంతో పాటు ప్రజల మౌలిక వసతులు
తీర్చడంలో ఎంతో కృషి చేశారు. ఈ క్రమంలో
ప్రభుత్వం నుంచి సక్రమంగా నిధులు విడుదల
కాకపోవడంతో వారికి నిరాశ తప్పలేదు.
గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేశాం. అప్పులు తెచ్చి మరి రైతు వేదిక స్మశాన వాటిక
పనులు చేశి అప్పులు పాలు ఐనా ప్రభుత్వం నుంచి బిల్లులు విడుదల
కావడం లేదు. ప్రభుత్వం స్పందించాలి
జాటోతు సురేష్ బాసుతండ గ్రామ సర్పంచ్
అందని నజరానా:
నర్సింహులపేట మండలం జయపురం ఉమ్మడి గ్రామ పంచాయతీలోనే 2 ఏకగ్రీవ
పంచాయతీలు ఉన్నాయి. వీటికి ప్రోత్సాహకంగా
అప్పటి ప్రభుత్వం నజరానా అందిస్తామని తెలిపింది.
ఐదేళ్లు పూర్తయినా ఇప్పటి వరకు ఇవ్వలేదు.


.jpg)
