నమస్తే మానుకోట న్యూస్
తెలంగాణ ఉద్యమకారులకు నామినేటెడ్ పదవులు కేటాయించాలని తెలంగాణ ఉద్యమ నాయకులు శంతన్ రామరాజు కోరారు మహబూబాబాద్ ఎమ్మెల్యే డా. భూక్యా మురళీ నాయక్ కు ఉద్యమకారులు వినతిపత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా అవకాశం కల్పిస్తామన్నారు.
ఈసందర్భంగా శంతన్ రామరాజు మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిన నాలాంటి ఎందరో ఉద్యమకారులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఆర్థికంగా చితికిపోయి శారీరకంగా, మానసికంగా కృంగి విలువైన సమయాన్ని ఉద్యమానికి ధార పోశామన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు మిగిలింది చీదరింలువు, ఛీత్కారాలు అవమానాలే అని వాపోయారు. పదేళ్ల బీఆరెస్ పాలనలో ఉద్యమ ద్రోహులు, ఉద్యమంలో మాఈపులు ఇమానం మోత మోగించిన దుర్మార్గులు పదవులు అనుభవిస్తుంటే మాలాంటి నిఖార్సయిన ఉద్యమకారులు మాత్రం కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగామని విచారం వ్యక్తంచేశారు. పదేళ్ల నిరంకుశత్వానికి పాతరేసి మార్పు కోరుకున్న తెలంగాణ సమాజంలో ఉద్యమకారులంతా ఏకమై కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో కీలక భూమిక పోషించారన్నారు. సోనియాగాంధీ ఆశీస్సులతో, రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడంలో ఉద్యమకారులమంతా మరో ఉద్యమమే చేశామన్నారు. ఉద్యమకారులను గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్యమకారులు స్వాగతిస్తున్నారని సంతోషం వ్యక్తంచేశారు. ఈక్రమంలో తెలంగాణ ఉద్యమకారులకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా నిరాశా నిస్పృహలతో ఉన్న ఉద్యమకారులకు సరైన న్యాయం చేసినట్లు అవుతుందన్నారు. వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు, గ్రంధాల చైర్మన్లతో పాటు వివిధ శాఖలకు సంబంధించి జిల్లా స్థాయి డైరెక్టర్లు ఇతరత్రా పదవుల్లో ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పించాలన్నారు. ఈరోజు కాంగ్రెస్ గెలుపులోనే తమ భవిష్యత్తును, ఆత్మగౌరవాన్ని ఉద్యమకారులు చూసుకుంటున్నారన్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే డా. భూక్యా మురళీ నాయక్ ఆధ్వర్యంలో ఉద్యమకారులకు సముచిత స్థానం లభిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
ఈకార్యక్రమంలో ఉద్యమకారులు కమ్మగాని కృష్ణమూర్తి, సిరిపురం వీరన్న, గుంజె హన్మంతు, నారాయణ్ సింగ్, గంగాధరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

