నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ శనివారం కల్లుగీతా కార్మిక సంఘం నూతన క్యాలెండర్ ని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గౌని వెంకన్న మరియు గీత కార్మిక సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్వాయి పాపన్న జీవన చిత్రాలను, గీత వృత్తిని ప్రతిబింబించే విధంగా కల్లుగీత కార్మిక సంఘం క్యాలెండర్ రూపొందించడం చాలా బాగుందని అన్నారు. గీతా కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా కృషి చేస్తుందని తెలిపారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గౌని వెంకన్న మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించాలని గీత కార్మిక సంఘం తరఫున తమరిని కోరుకుంటున్నామని దానికి మీ వంతుగా స్థల పరిశీలనకు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మండల కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు గుదే వెంకన్న,బొమ్మెర శ్రీకాంత్, కేసముద్రం మండల అధ్యక్షులు బబ్బురి ఉప్పలయ్య, పెద గూడూరు మండల అధ్యక్షులు పానుగంటి వీరస్వామి, నెల్లికుదురు మండల గౌరవ అధ్యక్షులు గొల్లపెల్లి యాదగిరి, మండల ప్రధాన కార్యదర్శి శీలం సత్యనారాయణ,జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గాడిపెల్లి శ్రీనివాస్, సంఘం నాయకులు గంధం వెంకన్న, గంధసరి స్వామి, సోషల్ మీడియా సభ్యులు దోమటి సోమయ్య, మరియు జిల్లా మండల కల్లుగీత కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు
.


