Type Here to Get Search Results !

ప్రమాదనికి గురైన కార్మికులకి కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఎక్సిగ్రేషియా సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించలని కోరిన సహయక కార్మిక కమీషనర్ జగదీష్


నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్
 

అసంఘటిత రంగాల్లో పనిచేస్తూ ఈ- శ్రమ్ పోర్టల్ లో పేరు నమోదు చేసుకుని ప్రమాదవశాత్తు చనిపోయినా, శాశ్వత అంగ- వైకల్యం పొందిన అసంఘటిత రంగ కార్మికులకి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఎక్సిగ్రేషియా అందిస్తున్నది. ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన క్రింద 26/08/2021 నుంచి 31/03/2022 మధ్య ఈ- శ్రమ్ పోర్టల్ లో పేరు నమోదు చేసుకొని, ప్రమాదవశాత్తు చనిపోయినా (లేక) శాశ్వత అంగ వైకల్యం పొందిన అసంఘటిత కార్మికుల నామినిలకు / కార్మికులకి ఏక్స్ గ్రేషియా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నది. మరణించిన కార్మికుల నామినులకు 2 లక్షలు, ఆంగ వైకల్యం పొందిన కార్మికులకి రూ. 1లక్ష అందిస్తుంది. కావున 

 మహబూబాబాద్ జిల్లా లోని అర్హులయిన అసంఘటిత కార్మికులు తేది. 12/02/2024 సాయంత్రం 5 గం||లలోపు ధరఖాస్తు తో పాటు మరణం ధ్రువపత్రం, ఆధార్, ఈ శ్రమ్ కార్డ్ , ఎఫ్ ఐ ఆర్ పంచనామా పోస్టుమార్టం రిపోర్ట్ నామిని, బ్యాంక్ అకౌంట్ వివరాలు జతచేసి సహయక కార్మిక కమీషనర్ కార్యాలయం, ఎఫ్ -24, ఐడి ఓసి కాంప్లెక్స్ లో అందచేయాలనిజిల్లా కార్మిక శాఖ కమిషనర్ జగదీష్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.