నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్
ఎగరాలి ప్రతి ఎదలో జాతీయ పతాకం అని మహబూబాబాద్ సబ్ జైలు జైలర్ మల్లెల శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారంనాడు 75వ. గణతంత్ర వేడుకలను జైల్లో ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం ఖైదీలకు మిఠాయిలు పంచారు. ఈసందర్భంగా జైలర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశానికి కరదీపికలాంటిదని అన్నారు. సమాజంలో ఎవరికివారు క్రమశిక్షణతో ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. నేర, అవినీతి రహిత సమాజం కోసం ప్రతిఒక్కరు కృషి చేయాలన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో పాటు భాద్యతలు కూడా నిర్వర్తించాలని సూచించారు.
ఈకార్యక్రమంలో డిప్యూటీ జైలర్లు మద్దెల రవీందర్, పట్టేం భిక్షపతి, సిటిజన్ ఫోరం సభ్యులు శంతన్ రామరాజు, హెడ్ వార్డర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


