ఘనంగా రిపబ్లిక్ వేడుకలు@NAMASTHE MANUKOTA NEWS(వీడియో వీక్షించండి)
(నర్సింహులపేట-నమస్తే మానుకోట)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పడమటిగూడెం గ్రామంలో 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉత్సవాలలో గ్రామ సర్పంచ్ జొన్నలగడ్డల యాదలక్ష్మీ పతాక ఆవిష్కరణ గావించారు .అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటుచేసిన ముగ్గుల పోటీలలో గెలుపొందిన మహిళలకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న నర్సింహులపేట జడ్పిటిసి భూక్యా సంగీత తో కలిసి సర్పంచ్ బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గన్న ఉపేందర్ రెడ్డి,వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ప్రజలు పాల్గొన్నారు.
