నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్
ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరూ శక్తివంతమైన ఆయుధంగా మలచుకోవాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కోరారు.
గురువారం ఐ డి ఓ సి లోని సమావేశ మందిరంలో 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని వయోవృద్ధులు దివ్యాంగులు యువ ఓటర్లతో సమావేశం ఏర్పాటు చేస్తూ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ప్రజాస్వామ్యంలో అతిశక్తివంతమైన ఆయుధంగా వినియోగించుకోవాలని కోరారు.
వయోవృద్ధులు, దివ్యాంగులకు ప్రభుత్వం ఓటు హక్కు వినియోగించుకునేందుకు సులభతరమైన మార్గాలను తీసుకుంటున్నట్లు తెలియజేశారు.
గతంలో బలం ఉన్న వారిదే రాజ్యం గా ఉండేదని, స్వాతంత్ర్యo అనంతరం 1950 జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని స్వేచ్ఛాయిత వాతావరణం లో నిర్వహించుకున్నట్లు తెలియజేశారు.
జాతి కులం మతం వంటి తారతమ్యాలు లేకుండా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా భారత ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు.
ఎన్నికలను సజావుగా ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఓటర్ల జాబితా చేపట్టవలసి ఉందని అందుకు ఓటర్లు చైతన్యవంతం అవడంతో పాటు ఓటు హక్కు పొందుతూ వినియోగించు కోవాలన్నారు.
ఓటు విశిష్టత పై నిర్వహించిన వ్యాసరచన వక్తృత్వం పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందించి అభినందించారు. 18 సంవత్సరములు నిండిన యువ ఓటర్లకు ఓటర్ గుర్తింపు( ఏపిక్ )కార్డులను అందజేశారు.
నిష్పక్షపాతంగా ఉంటూ సుదీర్ఘ కాలంగా ప్రతి ఎన్నికలలో తమ ఓటు హక్కు వినియోగించుకుంటూ ఉన్న వృద్ధులను పూలదండలు వేసి శాలువా లతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లెనిన్ వత్సవ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ డేవిడ్, డిఆర్డిఏ పిడి సన్యాసయ్య ఎలక్షన్ విభాగం అధికారులు పవన్ దివ్యాంగుల ఓటర్లు వయవృద్ధుల ఓటర్లు యువ ఓటర్లు తదితరులు పాల్గొన్నారు



.jpg)

