నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్
సమాజంలో గౌరవం పొందాలన్న, వ్యక్తిత్వ వికాసం వికసించాలన్న విద్యతోటే సాధ్యమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లెనిన్ వత్సవ్ తెలిపారు.
బుధవారం ఐడిఓసి లోని సమావేశ మందిరంలో ప్రపంచ బాలికల దినోత్సవం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని 10వ తరగతి విద్యార్థుల పరీక్షా ఫలితాల శాతాన్ని పెంపొందించుటకై జిల్లావ్యాప్త ప్రేరణ కార్యక్రమాన్ని, సంబంధిత కరపత్రాలు పోస్టర్లు బ్యానర్ను ఆవిష్కరించి ప్రారంభించారు.
జ్యోతిప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. చిన్నారులు చేసిన నృత్యం ఆకట్టుకుంది.
తెలంగాణ సాంస్కృతి సారథి కళాకారులు ఆలపించిన గీతాలు విద్యార్థులను ఆలోచింపచేసాయి.
అనంతరం సభను ఉద్దేశించి అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... విద్యార్థులు విద్యనభ్యసించడం ద్వారానే వ్యక్తిత్వం వికసిస్తుందని, ఉన్నతంగా రాణించగలుగుతారన్నారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నానాటికి పెరుగుతున్న దశలో విద్యార్థులు కూడా సాంకేతిక విద్యలో రాణిస్తూ ఉన్నతంగా ఎదగాలన్నారు ఈ పోటీ ప్రపంచంలో విద్యతోనే ఏదైనా సాధించవచ్చునన్నారు. ఆత్మవిశ్వాసం తో ముందడుగు వేయాలని, క్రమశిక్షణ పట్టుదల తోడైతే విజయం సాధించగలమన్న ఆత్మ ధైర్యాన్ని పెంపొందించుకోవాలన్నారు.
బాల్య వివాహాలు కూడా అంతరించిపోతాయని మహిళలందరూ వ్యక్తిత్వ వికాసంతో విలసిల్లుతూ సమాజంలో వెలుగొందుతారన్నారు.
ఒక మహిళ విద్యావంతురాలు అయితే ఆ కుటుంబం అంతా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని గ్రహించాలన్నారు.
ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి అశోక్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నిర్వహించే ఉచిత ప్రేరణ సదస్సులలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థుల పరీక్ష ఫలితాలను పెంపొందించుట కొరకు పరీక్షల్లో విజయం సాధించాలంటే అనే అంశంపై ఉచితంగా ప్రేరణ సదస్సులు సైకాలజిస్ట్ల సంఘం సహకారంతో నిర్వహించనున్నామని, విద్యార్థులు, సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు సద్వినియోగపరచుకోవాలని, వివరాలకు ఫోన్ నెంబర్ 9989310141 లలో సంప్రదించాలనితెలిపారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ రమాదేవి డిప్యూటీ సీఈఓ నర్మద, సిడిపిఓ శిరీష సఖి సెంటర్ నిర్వాహకురాలు శ్రావణి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు డాక్టర్ డేవిడ్.వి.ఏలియా,జి సి డి ఓ విజయ్ కుమారి, డిఎంహెచ్వో డాక్టర్ అంబరీష తదితరులు విద్యార్థిని విద్యార్థులు తెలంగాణ సాంస్కృతి సారధి కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

