నమస్తే మానుకోట న్యూస్ నర్సింహులపేట
యువత సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ అలవర్చుకోవాలని ఎవరికి నచ్చిన వృత్తి లో వారు స్థిరపడాలని చిరు వ్యాపారులకు సూపర్ మార్కెట్ లాబాదాయకమని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రు నాయక్ అన్నారు. నర్సింహులపేట మండల కేంద్రంలోని చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన "స్నేహ సూపర్ మార్కెట్" ను ఆయన ప్రారంభించారు. సూపర్ మార్కెట్ యజమాని రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జినుకల రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి, పెద్దనాగారం స్టేజ్ సర్పంచ్ బొబ్బ సోమిరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు కడుదుల రామకృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరోజు రాజశేఖర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిర్ర సతీష్, ఎస్టి సెల్ మండల నాయకులు భూక్య దేవీలాల్, రాజేందర్, మండల కాంగ్రెస్ నాయకులు యాదగిరి, గుండాల బిక్షం, గుండగాని వెంకన్న, చల్ల మధుకర్ రెడ్డి, ఉపేందర్ గౌడ్, లింగన్న యాదవ్, కాసా యాకన్న, దోమల యాదగిరి, అనిల్ కుమార్ యాదవ్, కనకాచారి, మధుసూదన్, తదితరులు పాల్గొన్నారు.

