నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్
ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు,సవరింపుల కొరకు ఈ నెల 21,22 తేదీలలో స్పెషల్ డ్రైవ్ చేపట్టామని, స్థానికంగా ఉన్న పోలింగ్ కేంద్రంలో బి.ఎల్.ఓ.లకు సవరించిన దరఖాస్తు అందించాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు.
ఆదివారం కలెక్టర్ మహబూబాబాద్, డోర్నకల్ ఆర్డీవోలు, తహసీల్దార్ లతో కలిసి మహబూబాబాద్ మండలంలోని బేతోల్, మల్యల, చౌక్ల తండా గ్రామలలోను, కురవి మండలం కురవి, తాళ్ల సంకీస గ్రామాలలో సందర్శించి బి.ఎల్.ఓ.ల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు నమోదు, సవరణకు అవసరమైన 6, 7, 8 ఫామ్స్ బూత్ స్థాయి అధికారుల వద్ద లభిస్తాయన్నారు. ఆన్లైన్ ద్వారా యాప్ లో నమోదు, పెండింగ్ లిస్ట్ లను పరిశీలిస్తూ...వివరాలను అడిగి తెలుసుకున్నారు. 2024 జనవరి 1వతేది నాటికి18 సంవత్సరాలు నిండిన వారికి ఓటుహక్కు కల్పించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు.
సాధ్యమైనంత వేగవంతంగా పెండింగ్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ చేపట్టాలని సూచించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి సిబ్బందికి సలహాలు, సూచనలు ఇస్తూ అవగాహన కల్పించాలన్నారు.
కలెక్టర్ వెంట మహబూబాబాద్, డోర్నకల్ ఆర్డీఓ లు అలివేలు, నరసింహారావు, మహబూబాబాద్, కురవి తహసీల్దార్ లు భగవాన్ రెడ్డి, సునీల్ రెడ్డి, తో పాటు నరేష్ తహసీల్దార్, బి.ఎల్.ఓ. లు తదితరులు ఉన్నారు.


