నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్
సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ కింద రైతులకు చెల్లించే నష్టపరిహారం ఒకే విధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రు నాయక్ కోరారు.
హనుమకొండ ఐ డి ఓ సి లో జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ కొండ సురేఖ దనసరి అనసూయ సీతక్క లు పాల్గొని ఉమ్మడి జిల్లాలలోని 12 నియోజకవర్గాల శాసనసభ్యులతోనూ ఉమ్మడి జిల్లాల యంత్రాంగంతో అభివృద్ధి సంక్షేమ పథకాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ నియోజకవర్గంలో సీతారామ ప్రాజెక్టు భూ సేకరణ కింద రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారం అందరికీ సమానంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రులకు విజ్ఞప్తి చేశారు.
జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న చెక్ డ్యాములకు మరమ్మత్తులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయాలన్నారు.
రైతుల ఉత్పత్తులు మార్కెటు లో విక్రయించు కునేందుకు స్థలము సరిపోక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విశాలంగా నిర్మించేందుకు 20 ఎకరాలు కేటాయించాలన్నారు.
మిషన్ భగీరథ త్రాగునీరు 15 మండలాలకే అందుతున్న దాన్ని మిగిలిన మూడు మండలాలు నీరు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు.
జిల్లాలో రెసిడెన్షియల్ పాఠశాలలను నెలకొల్పేందుకు స్థలాలు ఉన్నాయని నిధులు మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు.
తొర్రూరులో ఉన్న ఆర్డీవో కార్యాలయాన్ని మరిపెడకు మార్చాలని అలాగే మరిపెడలో మున్సిఫ్ కోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు
దళితులకు మంజూరు చేసిన స్థలాలలో పల్లె ప్రకృతి వనాలు చేపట్టారన్నారు.
మరిపెడ తొర్రూరు మండలాలలో వంద పడకల హాస్పిటల్ లకు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ధరణి సమస్య లపై రైతులకు భరోసా కల్పించాలన్నారు.
దేవాదాయ శాఖ భూముల పేరుతో మూడు నుండి నాలుగు గ్రామాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు.
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు డిబిఎం 162 క్రింద 32 ఎకరాలు ఆయకట్టు సాగవుతుందని తొర్రూరు దంతాలపల్లి మరిపెడ గుండెపుడి గ్రామాల మీదుగా చేపట్టిన కెనాల్ ద్వారా చివరి భూములకు నీరందేలా వ్యవస్థను పటిష్ట పరచాలన్నారు.
డోర్నకల్ మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి పనులపై వివరాలు కోరగా స్పందించడం లేదని మంత్రి దృష్టికి తేగా జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.



