కార్యకర్తలు ధైర్యపడవద్దని పార్టీలోకి కొత్తవారిని ఎవరిని చేర్చుకునే ఆలోచన లేదని ఒకవేళ వారు వచ్చిన గ్రామ కాంగ్రెస్ కమిటీల తీర్మానంతో మాత్రమే వస్తారని మీ నిర్ణయం మేరకే కొత్తవారికి అవకాశం ఉంటుందని డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్ అన్నారు.
నర్సింహులపేట మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. అత్యధిక మెజారిటీ ఇచ్చి నా గెలుపులో భాగస్వామ్యం ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నారని ఏ నాయకుడు వచ్చినా ఇంతకంటే ఎక్కువ మెజారిటీ రాదని మిమ్మల్ని నమ్ముకుని నేనున్నానని ఇంత భారీ మెజారిటీ ఇచ్చి నన్ను ఆదరించిన ప్రజలకు మీ నాయకత్వానికి ధన్యులని ఆయన అన్నాడు. గత పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ జెండాను డోర్నకల్ నియోజకవర్గంలో కాపాడింది గ్రామాలలో సామాన్య కార్యకర్తలని ఎవరికీ ఏ ఇబ్బంది రానివ్వనని ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకుంటారని వారు భరోసా ఇచ్చారు. గ్రామాలలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు చేరువయే పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రతి కార్యకర్త అధికారులతో కలిసి పని చేయాలని సామాన్యునికి ప్రభుత్వ ఫలాలు అందే విధంగా కృషి చేయాలని వారు అన్నారు. కచ్చితంగా ఆరు గ్యారెంటీ కార్డు హామీలను ప్రభుత్వం నెరవేర్చుతుందని వారు తెలిపారు. యువతను ఉపాధి వైపు దారి మరణించడానికి భవిష్యత్తులో నియోజకవర్గంలో కొన్ని ప్రైవేటు కమిటీలను తీసుకురావడానికి కృషి చేస్తానని వారు పేర్కొన్నారు.
అక్రమ ఇసుక, బియ్యం, బెల్లం వ్యాపారాలు చేయాలని అనుకునేవారు ఆలోచన మానుకోవాలన్నారు
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రమేష్ ఎంపీటీసీ అనురాధమండల వర్కింగ్ ప్రెసిడెంట్ శేర్ రామకృష్ణ శ్రీనివాస్ రావ్ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి సోమిరెడ్డి బీసీ ఎస్సీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు దశృ నాయక్ గుండా గాని వెంకన్న గౌడ్, రాజశేఖర్ మహబూబ్ ఖాన్, గుండాల బిచ్చం, సొసైటీ డైరెక్టర్ రజినీకాంత్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సతీష్ గౌడ్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రెటరీ తోట సురేష్ గ్రామ పార్టీ అధ్యక్షులు అయిలయ్య రామకృష్ణ ఉప్పలయ్య వెంకన్న రమేష్ మల్లయ్య శ్రీనివాసరావు శ్రీనివాస్ గౌడ్, మధుకర్ రెడ్డి అనిల్ నాయక్ నరేష్ సీనియర్ నాయకులు రణధీర్ రెడ్డి చంద్రారెడ్డి, ఐలయ్య, శ్రీనివాస్ రవీందర్ రెడ్డి ఆలువల శ్రీనివాస్ గౌని యాదగిరి ఎరనిగి రమేష యూత్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ కసా యకన్న దోమల యాదగిరి మహబూబ్ పాష కొంపల్లి యకాన్న వీరన్న సోమేష్ అశోక్ రెడ్డి ధనుంజయ రాజేందర్ అనిల్ క్రాంతి కుమార్ మున్వర్ తదితరుల పాల్గొన్నారు.



