నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్
*
మహాబూబాబాద్
మహబూబాబాద్ పట్టణంలో కలెక్టర్ కార్యాలయం వెనక పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలి ఇచ్చేంతవరకు సిపిఎం పోరాడుతుందని, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో కుమ్మక్కైన అధికారులు ఆ భూములను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆ భూమిని తక్షణమే ప్రభుత్వం పేదలకు పంచి, పట్టాలు ఇవ్వాలని, గుడిసె వాసులపై పెట్టిన అక్రమ కేసులు వేత్తివేయాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సుంకరి వీరయ్య డిమాండ్ చేశారు. మహబూబాబాద్ పట్టణంలో 255/1, 287, 551 లో పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని, ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం మహబూబాబాద్ లో సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయం నుండి భారీ ప్రదర్శన నిర్వహించి తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తాసిల్దార్ భగవాన్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాకు సిపిఎం పట్టణ కార్యదర్శి బానోతు సీతారాం అధ్యక్షత వహించగా సిపిఎం నేతలు జి నాగయ్య, సుంకరి వీరయ్య లుమాట్లాడారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ అధికారం కు రాకముందు మానుకోటంలో ఐదు వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని అందులో వామపక్ష పార్టీల ఆదరణ 400, 500 ఎకరాల్లో పేదలకు భూములు పంచి ఇవ్వగా మిగిలిన భూముల ను ఈ పది ఏళ్ల కాలంలో టిఆర్ఎస్ ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూమాఫియాదారులు, అధికారులతో కుమ్మక్కై ఆక్రమించుకున్నారని అన్నారు. టిఆర్ఎస్ నిర్బంధ నిరంకుశ పాలనకు విసిగి వేసారిన ప్రజలు గత్యంతరం లేక ఆ పార్టీని రాష్ట్రవ్యాప్తంగా ఓడించి ఇంటికి పంపించార ని అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కూడా పేదలకు ఇల్లు ఇస్తానని పట్టాలిస్తారని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెలరోజుల కావస్తుండగా వారు ఇంకా కుర్చీని సదురుకోక ముందే టిఆర్ఎస్ నాయకులు మహాబూబాబాద్ పట్టణంలో అధికారులతో కుమ్మక్కై ప్రభుత్వ భవనం ఆక్రమించుకుంటున్నారని, కబ్జా చేస్తున్నారని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారని విమర్శించారు. ఆలస్యమైన కొద్దీ మానుకోటలో ప్రభుత్వ భూములు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కబ్జా లోకి పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయం వెనక ఉన్న 255/1లో గత ఏడాది నుంచి 3000 మంది పేదలు గుడిసెలు వేసుకుని అక్కడే నివాసం ఉంటున్నారని అన్నారు. వీరిపై అధికారులు యంత్రాంగం మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో కుమ్మక్కై 18సార్లు దాడులు చేశారని దౌర్జన్యపూరితంగా పోలీసులు కేసులు నమోదు చేసి మహిళలను రాత్రిపూట పోలీస్ స్టేషన్ లో పెట్టి చిత్రహింసలు పెట్టి అర్ధరాత్రి కోర్టులో ప్రవేశపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పదిమంది మహిళలపై క్రిమినల్ కేసులో 150 మంది పై బెండొవర్ కేసులు పెట్టి వేధించారని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్బంధం నిరంకుశ భూకబ్జాలు అక్రమాల మూలంగానే ఓడిపోయిందని అన్నారు. ఒక అడుగు ముందున్న మహారాజు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మానుకోటలో కలెక్టరేట్ చుట్టూ మెడికల్ కాలేజ్ చుట్టూ ఇంజనీరింగ్ కాలేజీ చుట్టూ భూమి ఆక్రమించుకున్నాడని సర్వే నెంబర్లు మార్చి వేసి పట్టా భూముల నెంబర్లు వేసి తన కబ్జాలోకి తీసుకున్నాడని విమర్శించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎక్కడా తన భూములు లాక్కుంటారు అనే భయంతో తన చెప్పు చేతుల్లో ఉన్న అధికారులతో భూములలో తిష్ట వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని అన్నారు. మరోపక్క ఆ భూమలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపార అమ్మకాలు పెట్టేసి విక్రయిస్తున్నారు అన్నారు. నాడు తహసిల్దార్ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సమక్షంలో పేదలు, భూముల పట్టాల కోసం ధర్నా నిర్వహించగా శంకర్ నాయక్ ఆ ధర్నా కొచ్చి పేదలకు భూములు పంచుతానని పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని అన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న శంకర్ నాయక్ తన భూదాహం తీరక పేదలు గుడిసెలు వేసుకున్న భూములను కూడా బొక్కడానికి ప్రయత్నం చేశాడని అన్నారు. దొంగలు దొంగలు ఊర్లో పంచుకున్న చందంగా మానుకోటలో అధికారులు, మాజీ ఎమ్మెల్యే కలిసి ప్రభుత్వ భూములు పంచుకొని విక్రయించారని విమర్శించారు. పేదలకు భూములు దక్కాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇల్లు నిర్మించి ఇవ్వాలని లక్ష్యంతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసి వినతిపత్రం ఇచ్చామని తెలిపారు. మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి తక్షణమే స్పందించి అప్పటి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంకతో మాట్లాడారని అన్నారు. తక్షణమే ఆ భూముల సర్వే నిర్వహించి ఆ ప్రభుత్వంలోని పేదలకు పట్టాలిచ్చి ఇండ్లు ఇచ్చి ఏర్పాటు చేయాలని తక్షణం సంక్రాంతి పండుగ తర్వాత పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. అయితే అప్పటి కలెక్టర్ శశాంక బదిలీ అయినంత మాత్రాన మంత్రి ఇచ్చిన హామీ ఎక్కడికి పోదని ప్రస్తుత కలెక్టర్ ఆ భూమిలో మంత్రి ఆదేశాల మేరకు సర్వే చేసి పేదలకు పట్టాలి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ భూముల లో గుడిసెలు వేసుకుని నివసించడం పేదల హక్కుని రాజ్యాంగం కల్పించిన బతుకు హక్కు, జీవించే హక్కు అని వారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పట్టాలి ఇవ్వడంతో పాటు ఎన్నికల్లో హామీగా ఇస్తానన్న 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మరో 10 లక్షలు ఇవ్వాలని 15 లక్షలతో పేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించిన ఇండ్లకు ఏ పేరు పెట్టుకున్న తమకు అభ్యంతరం లేదని పేదలకు ఇల్లు దక్కితే చాలని వారు అన్నారు. భూ పోరాటంలో పేదలపై పోలీసులు పెట్టిన కేసులు అన్ని ఎత్తివేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని వెంటనే ఆ దిశగా పోలీసు యంత్రాంగం స్పందించి భూ పోరాట దారులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాటలు విని పేదలపై కేసులు పెట్టిన పోలీసులు అప్రతిష్ట పాలు అయ్యార ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాటలు నమ్మి అధికారులు తప్పు చేశారని రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు భూముల అక్రమంగా దారా దత్తం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములకు సిపిఎం కాపలాదారుగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నా సిపిఎం ఆధ్వర్యంలో పేదలకు గుడిసెలు వేయించి ఇస్తామని స్పష్టం చేశారు. కలెక్టరేట్ ఎనకాల పేదలు వేసుకున్న గుడిసెల ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ అటవీ శాఖకు కేటాయించినట్లు చెబుతుండగా అటవీ అధికారులు అక్కడ నిర్మాణాలు చేస్తుండగా అది అటవీ భూమిని ప్రచారం చేస్తున్నారని గుడిశ వాసులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని వాస్తవానికి అది అటవీ శాఖ భూమి కాదని పక్కా ప్రభుత్వ భూమి అని పేదలు భయాందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. భూమి దక్కేంతవరకు పేదలు ఆ భూమిని వదిలిపెట్టవద్దని గుడిసె ఉన్న వంట పాత్రలు ఉన్నా లేకున్నా అక్కడే తిని అక్కడే పడుకోవాలని స్పష్టం చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వంలో టిఆర్ఎస్ నాయకులు అధికారులు కుమ్మక్కై ప్రజలను దోచుకున్నారని విమర్శించారు. జీవో నెంబర్ 58 తొమ్మిది ద్వార పేదలకు పట్టాలి ఇస్తామని సర్వే చేసి ఇవ్వకుండా దాటే వేశారని అన్నారు. పేదలకు ఇవ్వాల్సిన పట్టాలను టిఆర్ఎస్ నాయకులు తమ గృహాలు పెట్టుకొని పేదలను వేధిస్తున్నారని అన్నారు. పట్టాలను టిఆర్ఎస్ నాయకులకు అధికారులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు మహబూబాబాద్ పట్టణంలో కలెక్టరేట్ వెనకాల ఉన్న భూమిలో పేదలు, గుడిసెలు వేసుకుని ఆక్రమించుకునే అంతవరకు అధికారులకు సోయలేదని అన్నారు మా భూమిలో పేదల గుడిసెలు వేసుకుని నిర్వహిస్తున్న అధికారులు అక్కడికి రాగా పేదలు ప్రశ్నించారని అది ప్రభుత్వ భూమా రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూమా ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమా చెప్పాలని ప్రశ్నించారని అన్నారు అప్పుడు స్పందించిన అధికారులు సర్వే చేసి, అది ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టారని స్పష్టం చేశారు. సిపిఎం నాయకులు ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ భగవాన్ రెడ్డికి ఇళ్ల స్థలాల పట్టాలి వాళ్ళని వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములు
పరిరక్షిస్తామని కలెక్టర్ ఆదేశాల మేరకు సర్వే చేసి నివేదికలు కలెక్టర్కు పంపిస్తామని అన్నారు. ప్రభుత్వం ఎక్కడైనా అన్యాక్రాంతమైనట్లు తమ దృష్టికి తీసుకువస్తే చర్య తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ భూముల పట్టాల కోసం ప్రజలు పేదలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మధ్య దళాలను ఆశ్రయించవద్దని నేరుగా తహసిల్దార్ కార్యానికి వచ్చి వివరాలు తెలుసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సుర్ణపు సోమయ్య, ఆకుల రాజు, గునిగంటి రాజన్న, అల్వాల వీరయ్య, కందునురి శ్రీనివాస్, సమ్మెట రాజమౌళి, కుర్ర మహేష్, దుడ్డుల రామ్మూర్తి, కుంట ఉపేందర్, నక్క సైదులు, చీపిరి యాకయ్య, రావుల రాజు, చాగంటి భాగ్యమ్మ, కుమ్మరి కుంట నాగన్న, తోట శ్రీనివాసు, ఎర్ర శ్రీనివాస, బానోతు వెంకన్న, బూర్గుల లక్ష్మణ, యమగాని వెంకన్న, శ్రీరాం నాయక్ పాల్గొన్నారు
.




