నర్సింహులపేట
మండల ప్రజలకు పోలీసు వారి
విజ్ఞప్తి.
నూతన సంవత్సరం
వేడుకల సందర్భంగా డిసెంబర్ 31 నాడు రాత్రి అవాంఛనీయ సంఘటనలు
జరగకుండా జాగ్రత్తలు
తీసుకోవాలని
డిసెంబర్ 31 వేడుకలు పోలీస్ సూచనలు పాటిస్తూ శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని నర్సింహులపేట ఎస్సై గండ్రాతి సతీష్ కోరారు
పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేకంగా టీములు ఏర్పాటు చేసి డిసెంబర్ 31 రోజు సాయంత్రం నుండి తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మైనర్లకు బైకులు ఇవ్వడం వల్ల ప్రమాదాలు జరగవచ్చునని తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు బైకులు ఇవ్వరాదని తెలిపారు. మద్యం మత్తులో రోడ్లపై బైక్ నడుపుతున్నట్టు కనబడితే కేసులు నమోదు చేస్తామని సైలెన్సర్లను తీసేసి వాహనాలు నడపడం శబ్ద కాలుష్యం చేయడం అధిక వేగంతో వాహనాలు నడపడం త్రిబుల్ రైడింగ్ చేస్తే ఇతరులను ఇబ్బంది పెడితే వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. గుంపులు గుంపులుగా రోడ్లపై కేకలు వేస్తూ తిరగడం వాహనాలతో ర్యాలీగా వెళ్లడం చేయరాదుఅన్నారు రోడ్లపై టపాసులు మైకులు ఎక్కువగా సౌండ్ పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని తెలిపారు డీజే లు నిషేధించడం జరుగుతుంది.
బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం నిషేధించబడినది బహిరంగ ప్రదేశాల్లో ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు పోలీస్ శాఖ తీసుకునే ముందస్తు రక్షణ చర్యలు ప్రజలు సంపూర్ణమైన సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతూ ఈ నూతన సంవత్సరం వేడుకలు ప్రతి ఒక్కరు తమ కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

