నమస్తే మానుకోట న్యూస్ దంతాలపల్లి
మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషులలో ఎలాంటి తారతమ్యం లేకుండా స్వేచ్చ సమానత్వం కలిగి ఉండాలని ప్రభుత్వ విప్ డాక్టర్ రాంచందర్ నాయక్ అన్నారు.బుధవారం దంతాలపల్లి ఫంక్షన్ హాల్ ఆవరణంలో బాల వికాస ఆధ్వర్యంలో వికాస బాల,బాలికలకు సానుభూతి (జన్మదిన) వేడుకలు నిర్వహించారు,ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ రాంచందర్ నాయక్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మనుషుల మధ్యలో అందరు ఉన్న (అనాధలుగా) ఒంటరిగా మిగిలిపోతున్నారని,ఇలాంటి తరుణంలో బంధాలు,బంధుత్వాల కన్న ఆత్మీయత, అభిమానం,సమానత్వం ఉండాలని ఆమె అన్నారు,వీరి కోసం బాల వికాస ముందుకు రావడం అభినందనీయం అని,నేటి పోటీ ప్రపంచంలో రాణించాలంటే చిన్నప్పటి నుండే లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు,పట్టుదలతో చదివి,ఉన్నతంగా ఎదగాలని డాక్టర్ రాంచందర్ నాయక్ ఆకాంక్షించారు



