ప్రజా పాలన లో నిజమైన లబ్ధిదారులకు 6 గ్యారంటీలను వర్తింపజేసి ఆర్థిక చేయూత అందిస్తాం........
డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రాంచంద్రునాయక్.
నమస్తే మానుకోట న్యూస్ నర్సింహులపేట
అర్హులకు అన్ని పథకాల అమలుకు ప్రభుత్వం ప్రజాపాలన తో శ్రీకారం....
అభయహస్తం 6 గ్యారంటీలతో ప్రగతి పథం సకల జనహితం కానుందని, అర్హులైన పేదవారికి ఆర్థిక చేయూత కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రాంచంద్రునాయక్ అన్నారు
గురువారం ఉదయం డోర్నకల్ నియోజకవర్గం నర్సింహులపేట మండలంలోని పెద్దనాగారం స్టేజి గ్రామపంచాయతీ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ రాంచంద్రు నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొని
ముఖ్యమంత్రి సందేశాన్ని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. లబ్ది దారుల ఎంపికలో దళారుల ప్రమేయం ఉండదని
ఆరు గ్యారెంటాలను పకడ్బందీగా అమలు పరుస్తామని,
మనది ప్రజా ప్రభుత్వమని, అసలైన అర్హులకు 6 గ్యారంటీలను ఖచ్చితంగా వర్తింప చేస్తామన్నారు. డిసెంబర్ 28 వ తేది నుండి 2024 జనవరి 6 వ తేదీ వరకు ప్రజాపాలనతో అభయ హస్తం గ్యారంటీలకు దరఖాస్తుల స్వీకరణ ప్రతి గ్రామంలో,వార్డుల్లో నిర్వహించబడుతుందన్నారు.
మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇండ్లు,అభయ హస్తం లాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ఒకటే దరఖాస్తులో అన్ని నింపాల్సి ఉంటుందని, అవసరమగు జిరాక్స్ కాపీలను వెంట జత చేయాలని, అధికారులకు మధ్య దళారులకు ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దని, దరఖాస్తును కూడా ప్రభుత్వమే అందిస్తుందని, ప్రభుత్వం మంజూరు చేసే సంక్షేమ పథకాలకు ఎవ్వరికీడబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, మిమ్మల్ని అడిగితే, ఇబ్బందులకు గురి చేస్తే నేరుగా ఫిర్యాదు చేయాలన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 20 రోజులలోనే 2 పథకాలను విజయవంతంగా అమలు చేసుకుంటున్నామని, మిగతా పథకాలను 100 రోజుల్లో అమలు చేస్తామని పార్టీలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపడతామన్నారు. ప్రభుత్వ పథకాలు దుర్వినియోగం కాకుండా అధికారులు బాధ్యతాయుతంగా తమ కర్తవ్యాలను నిర్వర్తించాలని కోరారు.
లబ్ధిదారుల దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించాలని అర్హులైన పేదలకు 6 గ్యారంటీలను వర్తింప చేయాలని, పెండింగ్లో ఉన్న పనులను అన్నిటిని సకాలంలో పూర్తి చేస్తామన్నారు.
6 గ్యారంటీల సంక్షేమ ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ రాంచంద్రు నాయక్ తెలిపారు.
అనంతరం గ్రామపంచాయతీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దరఖాస్తుల స్వీకరణ స్టాల్స్ ను ఎమ్మెల్యే ప్రారంభించి దరఖాస్తుదారుల నుండి ఫారాలను స్వయంగా స్వీకరించారు
ఈ కార్యక్రమంలో పెద్ద నాగారం స్టేజ్ సర్పంచ్ బొబ్బ సోమిరెడ్డి, ఉపసర్పంచ్ అనిల్, డోర్నకల్ నియోజకవర్గ ప్రత్యేక అధికారి సుధాకర్, మండల ప్రత్యేక అధికారి రాజేందర్, డీఎస్పీ వెంకటేశ్వర బాబు, తాహసిల్దార్ వివేక్, ఎంపీడీవో భారతి, డిఈ నర్సింగ్ నాయక్, ఎంపిఓ సోమ్లాల్, ఇంచార్జ్ వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పళ్ళ మాలతి రెడ్డి, ఏఈఓ కరిష్మా, ఏఈ పాండు నాయక్, ఆర్ఐ సైదులు, కాంగ్రెస్ యువజన నాయకులు భూక్య దేవిలాల్, హరిలాల్, బొబ్బ అశోక్ రెడ్డి, మధు, నరేష్, రమేష్,మెడికల్ ఆఫీసర్లు పంచాయతీ కార్యదర్శులు, అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




