సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె.శశాంక అదనపు కలెక్టర్ (రెవెన్యూ} ఎం.డేవిడ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో తో కలిసి ప్రజల నుండి వినతులు స్వీకరించి అట్టి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా గూడూరు మండలం దస్రు తండా కు చెందిన గుగులోత్ మోహన్ తనకు భూమికి చెందిన పట్టా పుస్తకములో తన ఫోటో కాకుండా తన భార్య ఫోటోతో పాస్బుక్ జారీ అయి తనకు రైతు బంధు వస్త లేదని ఫోటో మార్చి తనకు రైతు బంధు వచ్చేలా చేయాలని కోరారు.
బయ్యారం మండలం కంబాలపల్లి (కొత్తూరు) గ్రామానికి చెందిన చాట్ల ముత్తమ్మ తన పేరుపై పట్టా పాసు పుస్తకము జారీ అయిన తరువాత తనకు గల భూమి అటవీ కి సంబంధించినదని 1బి పహాణీని రైతు బంధు నిలిపివేశారని మరల సర్వే చేయించి తగు న్యాయం చేయాలని కోరారు
నెల్లికుదురు మండలం రామన్నగూడెం గ్రామ పంచాయతీ వాసులు తమ గ్రామపంచాయతీ రిజర్వేషన్ 2019 సంవత్సరం లో S. C రిజర్వుడుగా సర్పంచ్ ఎన్నిక జరిగినదని కానీ తప్పుగా జరిగిన అట్టి రిజర్వేషన్ ను ప్రభుత్వ నిబంధనల ప్రకారం సరిచేసి అంతకు ముందు జరిగిన దానిపై విచారణ జరిపించాలని కోరారు.
డోర్నకల్ మండలం వెన్నారం గ్రామానికి చెందిన వై పవన్ కుమార్ నాగ్పూర్ నుండి అమరావతి N. హ్.163 హై వే లో మా గ్రామంలోని తన సర్వే నెం.481/1/1 లో ఎకరం 20.గుంటల భూమి పోతుందని కానీ నష్టపరిహారం జాబితా లో లేనందున విచారించి అట్టి సర్వే నెంబర్ లోని తన భూమికి నష్టపరిహారం వచ్చేలా జాబితాలో తన పేరు ఉండేలా చూడాలని కోరారు.
ఈ రోజు నిర్వహించిన గ్రీవెన్స్ లో (50) వచ్చిన దరఖాస్తులను వివిధ శాఖల అధికారులకు పరిష్కారం కోసం అధికారులను ఆదేశించారు.
ఈ గ్రీవిన్స్ లో లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పా, అదనపు కలెక్టర్ రెవిన్యూ డేవిడ్, జెడ్ప్ సీఈఓ రమాదేవి, డిఆర్ డీఏ సన్యాసయ్య, జిల్లా అధికారులు, మండల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు



