![]() |
| సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శశాంక. |
మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలకు దరఖాస్తులు స్వీకరణ .
ప్రతి గ్రామ పంచాయతీలోనూ, మున్సిపల్ వార్డులోనూ జనవరి ఆరవ తారీకు వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి.
ప్రభుత్వం ఇచ్చిన ఐదు హామీల దరఖాస్తుల తో పాటు ఇతర పథకాలపై కూడా దరఖాస్తులు స్వీకరిస్తాం.
ప్రజా పాలన దరఖాస్తులు ప్రతిరోజు స్వీకరిస్తాం .
ప్రజా పాలన కార్యక్రమం నిర్వహణకు పక్క ప్రణాళిక.
(నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్)
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు పథకాలపై ఈనెల 28వ తేదీ నుండి గ్రామపంచాయతీ మున్సిపల్ వార్డులలో దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకు పోతామని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు.
మంగళవారం ఐ డి ఓ సి లోనే కలెక్టర్ కాన్ఫరెన్స్ సమావేశంలో ప్రజా పాలన కార్యక్రమం అమలుకు చేపట్ట వలసిన పలు అంశాలను రూపొందించవలసిన ప్రణాళిక పై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఈ నెల 28వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు చేపట్టనున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజల చెంతకు తీసుకు వెళ్లేందుకు పక్కా ప్రణాళిక వెళ్లాలని అధికారులకు సూచించారు.
ప్రతి కుటుంబానికి ఒక దరఖాస్తు అందేలా రోజుకు రెండు గ్రామాలు చొప్పున ప్రతి గ్రామపంచాయతీ, మున్సిపల్ వార్డులలోనూ సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని సూచిస్తూ ప్రతి పంచాయతీలోనూ వారం వరకు దరఖాస్తులు తీసుకుంటామని ప్రజలకు తెలియ చెప్పాలన్నారు. ప్రతి దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్లు జతపరిచి ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్ చొప్పున ఐదు కౌంటర్స్ ప్రతి పంచాయతీలో ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట జనాభా ప్రాతిపదికన అదనపు కౌంటర్లు కూడా ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా ఇతర పథకాల కొరకు దరఖాస్తులు స్వీకరించేందుకు జనరల్ కౌంటర్ ను కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. 28, 29 తేదీలలో చిన్న గ్రామపంచాయతీలు తీసుకొని 30వ తేదీ నుండి రెండో తారీకు వరకు పెద్ద గ్రామపంచాయతీలు తీసుకోవాలన్నారు.
ప్రతి సమావేశంలోనూ ప్రభుత్వం రూపొందించిన ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని అదేవిధంగా మరో ఫ్లెక్సీని గ్రామ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేయాలన్నారు.
ప్రతి సమావేశానికి ముందుగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని అందులో దరఖాస్తులు నింపని వారికి నింపడం అడిగిన వాళ్లకు సలహాలు ఇవ్వాలని అన్నారు. త్రాగునీటి ఏర్పాట్లు చేపట్టాలన్నారు అదేవిధంగా వీల్ చైర్ను కూడా సిద్ధంగా పెట్టుకోవాలన్నారు.
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో ప్రతి వార్డు లోను వార్డు వారీగా సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు ప్రతి రోజు గ్రామానికి ఉదయం 7 గంటలకు చేరుకోవాలని సూచిస్తూ ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సమావేశాలు నిర్వహించడం దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు.
దరఖాస్తులను ప్రభుత్వమే ప్రజలకు అందజేస్తుందన్నారు. కుర్చీలు ఏర్పాటు చేయాలని, మరుగుదొడ్లు సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ప్రజా పాలనపై ప్రతి గ్రామంలోను, మున్సిపల్ వార్డులలో విస్తృత ప్రచారం చేపట్టాలని, దండోరా వేయించాలని, టామ్ టామ్ చేయించాలని కలెక్టర్ ఆదేశించారు.ఇది నాలుగు నెలలకు ఒకసారి సమావేశం ఉంటుందని తెలియజేయాలన్నారు స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు రసీదు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు.సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్, జెడ్పి సీఈవో రమాదేవి, డిఆర్డిఏ పిడి సన్యాసయ్య, జిల్లా పంచాయతీ అధికారి హరిప్రసాద్, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తాసిల్దార్ లు, ఎంపీడీవోలు, ఎంపిఓలు, ఎంఈఓ లు, డిప్యూటీ తాసిల్దారులు , వ్యవసాయ శాఖ అధికారులు మిగతా మండల స్థాయి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .



