Type Here to Get Search Results !

కౌంటింగ్ ఏర్పాట్లను పట్టిష్టంగా చేపట్టాలి-జిల్లా కలెక్టర్

(నమస్తే మానుకోట-మహబూబాబాద్ డిసెంబర్ 01)


తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, కళాశాలలో అసెంబ్లీ ఎన్నికలు 2023 ఈనెల మూడవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు చేపట్టే కౌంటింగ్ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ మొదలవుతున్నందున 6 గంటలకు పాత్రికేయులు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని అన్నారు ముందుగా కౌంటింగ్ ఏర్పాట్లు ప్రణాళిక బద్ధంగా మ్యాపు రూపంలో ఏర్పాటు చేసుకోవాలన్నారు. బారి కేడ్ లను పటిష్టంగా ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసుకోవాలని ఆయా కేంద్రాలను సూచించేలా బ్యానర్లు ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రం ఆవరణ లోనికి ఇతరులకు అనుమతి ఇవ్వరాదన్నారు. పనులు నిర్వహించే సిబ్బందికి గుర్తింపు కార్డులు అందజేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. కౌంటింగ్ కేంద్రాలలో లైటింగ్ ఎక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్ సిబ్బందికి మైక్రో అబ్జర్వర్ లకు ఈ నెల 2వ తేదీ ఉదయం 10 గంటలకు ఐడిఓసిలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ సమావేశంలో శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు. సెల్ ఫోన్లు కౌంటింగ్ కేంద్రాలలోనికి అనుమతించబోమని తెలియజేశారు పార్టీ ప్రతినిధుల ఏజెంట్లకు ఐడి కార్డులు జారీ చేసేందుకు ప్రతిపాదనలు ఇవ్వాలన్నారు. మీడియా పాయింట్ ఏర్పాట్లను డిపిఆర్ఓ చూడాలని తెలియజేస్తూ మైకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మీడియా సెంటర్లో ఎల్ఈడి ఏర్పాటు చేయాలని గ్రౌండ్ వాటర్ అధికారి ఎన్నికల నోడల్ అధికారి సురేష్ ను ఆదేశించారు. పోలీస్ అధికారుల సూచనల మేరకు వాహనాలన్నింటినీ డిగ్రీ కళాశాలలో నిలిపివేసేలా చర్యలు తీసుకుంటామన్నారు అధికారుల వాహనాలు మాత్రమే కౌంటింగ్ కేంద్రం ఆవరణలోకి అవకాశం కల్పిస్తామన్నారు. కౌంటింగ్ ఏర్పాట్లు పాల్గొంటున్న సిబ్బందికి త్రాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు . ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్ డోర్నకల్ మహబూబాబాద్ రిటర్నింగ్ అధికారులు నరసింహారావు అలివేలు జిల్లా డోర్నకల్ మహబూబాబాద్ నియోజకవర్గ నోడల్ అధికారులు సుధాకర్ సూర్యనారాయణ ఇంజనీరింగ్ అధికారి అరుణ్ కుమార్ గ్రౌండ్ వాటర్ ఎన్నికల నోడల్ అధికారి సురేష్ తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.