(నమస్తే మానుకోట-నర్సింహులపేట)
తనను సన్మానించడానికి వచ్చిన ఓ దివ్యాంగ కార్యకర్తను ఎమ్మెల్యే సన్మానించిన ఘటన నర్సింహులపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది.మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని నర్సింహులపేట మండలంలో డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్. రామచంద్రునాయక్ పర్యటించారు. ఈ సందర్భంగా పెద్దనాగారం గ్రామంలో 'ప్రజా పాలన' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే, అనంతరం నరసింహులపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సమావేశం పూర్తైన తదుపరి కార్యకర్తలు ఎమ్మెల్యేకు బొకేలు, శాలువాలతో సన్మానించారు. కాగా పడమటిగూడెం గ్రామానికి చెందిన దాసరోజు కనకాచారి అనే కార్యకర్త దురదృష్టవశాత్తు ఇటీవల ఓ ప్రమాదంలో అంగవైకల్యాన్ని పొందాడు.కాంగ్రెస్ పార్టీని ,డా.రాంచంద్రునాయక్ పై అభిమానాన్ని కలిగి ఉండి ,ఆత్మవిశ్వాసంతో తన తోటి కాంగ్రెస్ నాయకులతో సమానంగా కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రేయింబవళ్లు కృషిచేశాడు.తద్వారా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డా.రాంచంద్రునాయక్ కు భారీ మెజారిటీ ని అందించారు.దీంతో నేడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో మొక్కవోని ఆత్మవిశ్వాసంతో రాష్ట్ర ప్రభుత్వ విప్ , ఎమ్మెల్యే డా.రాంచంద్రునాయక్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా.రాంచంద్రునాయక్ కనకాచారిని సన్మానించడంతో దివ్యాంగులపై ఎమ్మెల్యే కు ఉన్న గౌరవానికి,ప్రేమకు పలువురు అభినందిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన బి.సి బంధుకు, వికలాంగుడై అన్ని అర్హతలు ఉన్నా, కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనీ నిరాకరించారు.ఈ ప్రభుత్వం లోనైనా కనకాచారి కి న్యాయం జరుగాలని పలువురు కోరుతున్నారు.

