మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో స్వతంత్ర అభ్యర్థి ననావత్ భూపల్ నాయక్ తన నామినేషన్ ను దాఖలు చేశారు.ఈ సందర్బంగా బారి ర్యాలీ తో బయలు దేరిన భూపల్ నాయక్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని స్థానిక పోలీస్ లు అడ్డుకున్నారు.అనుమతిలేకుండా ఫిట్నెస్ లేని వాహనాలలో భారీగా జనాలను తీసుకురావడంతో మరిపెడ లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది కాగా పోలీసులు అడ్డుకున్నారు.ఈ నేపథ్యంలో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది.తదుపరి షరతులతో కూడిన నిబంధనలను అనుసరించి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో కి వెళ్లి నామినేషన్ ను దాఖలు చేశారు.కాగా ఎన్నికల నిబంధనలను ఉల్లలంఘించిన నేపధ్యంలో పలువురిపై కేసులు నమోదు చేయనున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.కాగా సోమవారం ఇద్దరు స్వతంత్ర అభ్యర్ధులు నామినేషన్ ను దాఖలు చేసినట్లుగా ఎన్నికల అధికారులు తెలిపారు.

