Type Here to Get Search Results !

అన్ని వర్గాల అభివృద్ధి కేసీఆర్ తోనే-రవిందర్ రెడ్డి.



(నమస్తే మానుకోట-నర్సింహులపేట)
 సబ్బండ వర్గాల ప్రజల అభివృద్ధే లక్ష్యంగా   సి ఏం కేసీఆర్ నేతృత్వంలో కృషి చేస్తున్న ఎమ్మెల్యే రెడ్యానాయక్ , కు  అండగా నిలవాలని ,అన్ని వర్గాల ప్రజలకు ఫలాలు అందాలంటే బిఆరెస్ అధికారంలోకి రావాలని ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి ఋణాన్ని తీర్చుకోవాలని  పెద్దనాగారం స్టేజి గ్రామ పార్టీ అధ్యక్షుడు అల్లిపురం రవిందర్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా శనివారం జగ్యా తండాలో ఇంటి,ఇంటికి బిఆరెస్ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నారని కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే ఏకైక నాయకుడు రెడ్యానాయక్ అనీ ,  ఏకైక పార్టీ  బిఆర్ఎస్ మాత్రమే నని ఎన్నికల్లో రెడ్యానాయక్  కారు గుర్తుకు ఓటు వేసి సీఎం కేసీఆర్ ను మరో మారు ముఖ్యమంత్రిని చేసుకునేందుకు కృషి చేయాలని అన్నారు. కెసిఆర్ కిట్టు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు ,రుణమాఫీ, రైతు బీమా, ఆసరా ,వికలాంగులకు పెన్షన్లు లాంటి ఎన్నో కార్యక్రమాలను బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్  నాయకులు పుల్లయ్య , దామోదర్ రెడ్డి,లింగ రెడ్డి,జైపాల్, ఎల్లయ్య,లింగ్య నాయక్, వెంకన్న రాములు, భాస్కర్, జగ్గు, విజయ్, బాలజి,హరిచంద్రు ,మరియు సోషల్ మీడియా కోఆర్డినేటర్ అజ్మీరా రవిబాబు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.