![]() |
| మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న తొర్రూరు డిఎస్పీ వెంకటేశ్వర్లు బాబు |
(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
భార్యను హత్యచేసి ఆత్మహత్య గా చిత్రీకరించిన ఓ వ్యక్తి కటకటాల పాలైన ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం లోని తూర్పు తండా లో చోటు చేసుకుంది.ఈ నెల ఒకటో తేదీన గుగులోతు సారమ్మా (30)అను వివాహిత కుటుంబ సభ్యుల వేదింపులకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి భూక్యా బిచ్చా పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఘటనపై దంతాలపల్లి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.. మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్లో నిర్వహించిన పోస్ట్ మార్టం నివేదికలో మృతురాలు హత్యకు గురైనట్లు తేలడంతో భర్త గుగులోతు రాజేందర్ (32)ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది.ఈ సందర్భంగా తొర్రూరు డీఎస్పీ వెంకటేశ్వర్లు బాబు తెలిపిన వివరాల ప్రకారం భార్య అనారోగ్యం పాలై శారీరకంగా సహకరించకపోవడం, తనకు వచ్చిన వ్యాధి పిల్లలకు వ్యాప్తి చెందుతుందనే అనుమానంతో భార్య సారమ్మను చీర ముక్క తో గొంతుకి ఉరి బిగించి హత్య చేశాడని, అనంతరం తన భార్య తనకు తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు చిత్రీకరించినట్లుగా తెలిపారు. సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిందితుడు రాజేందర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కేసు త్వరితగతిన ఛేదించిన సీఐ సత్యనారాయణ, ఎస్సై రమేష్ బాబును డీఎస్పీ వెంకటేశ్వర బాబు అభినందించారు.

