(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని, నియోజకవర్గంలో తాము చేస్తున్న అభివృద్ధిని ఆలోచించి ఈ ఎన్నికలలో ఓటు వేయాలని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. ఈ సందర్భంగా దంతాలపల్లి మండలంలోని పలుగ్రామాల్లో ఎమ్మెల్యే రెడ్యానాయక్ పర్యటించారు. ఈ సందర్భంగా పెద్దముప్పారంలో రెడ్యానాయక్ మాట్లాడుతూ కొట్లాది రూపాయలు వెచ్చించి పెద్ద ముప్పారం గ్రామాల్లో రోడ్లను నిర్మించామని,గ్రామంలో రెడ్యానాయక్ మాత్రమే అభివృద్ధి చేశాడని ,ఓటు అడిగే హక్కు కేవలం బిఆరెస్ పార్టీకే ఉందని అన్నారు..ఓటువేసేటప్పుడు ఎవరు అందుబాటులో వుంటారో ఆలోచించి ఓటు వేయాలని అన్నారు.ఎవరికి వాళ్లే ముఖ్యమంత్రులని చెప్పుకునేవారు అభివృద్ధి చేయలేరని అన్నారు..రైతులకు మూడుగంటల కరెంట్ ఇవ్వాలని చెప్పినవారు కావాలా? , 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చేవాళ్ళు కావాలా అని రెడ్యా అన్నారు.ఇచ్చిన హామీ మేరకు చెరువుకు నీళ్లు తీసుకొని వచ్చే విదంగా చెక్ డ్యామ్ మంజూరు చేయిస్తానని ,తనకు పెద్దముప్పారం గ్రామం సెంటిమెంట్ అనీ ,మొట్టమొదటగా ఇక్కడి నుంచి ప్రచారం ప్రారంభించానని ,నియోజకవర్గంలో సరైన నాయకుడిని తాను మాత్రమే నని ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో తో గెలిపించాలని రెడ్యానాయక్ అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పి వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వరరెడ్డి,రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు వలాద్రి మల్లారెడ్డి, ఎంపిపి ఉమ,పిఎసిఎస్ చైర్మన్ సంపెట రాము, మండల పార్టీ అధ్యక్షులు ధర్మారాపువేణు,బి.ఆర్.ఎస్ జిల్లా నాయకులు కొమ్మినేని రవిందర్ ,గొడిశాల సంజీవ గ్రామ సర్పంచ్ లు నూకల హిమబిందు,గండి నారాయణ ,ఎంపిటిసి పద్మ ,గ్రామ పార్టీ అధ్యక్షుడు యాకయ్య ,మధుకర్ రెడ్డి వివిధ గ్రామాల సర్పంచ్ లు ,ఎంపీటీసీలు, ఉపసర్పంచ్ లు,ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .





