తెలంగాణ రాష్ట్రం లో పలు సంక్షేమ పథకాలు చూసి ప్రజలు బి ఆర్ ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని కేసముద్రం సోషల్ మీడియా అధ్యక్షులు వాంకుడొత్ తరుణ్ నాయక్.శుక్రవారం కేసముద్రం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ధే మా కులం సంక్షేమమే మా మతం జనహితమే మా అభిమతం అంటూ మన తెలంగాణను విజయ తీరం వైపు నడిపిస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ .మన తెలంగాణ తలరాత మార్చిన నేత కేసీఆర్ కు అండగా నిలుద్దామని అన్నారు.అలాగే మన శంకరన్న ను గెలిపించుకొని మళ్ళీ అసెంబ్లీకి పంపుదామని,మన మానుకోట అభివృద్ధిని మరింత అందంగా చేసుకుందామని అన్ని అన్నారు.తెలంగాణ రాష్ట్రం లో పలు సంక్షేమ పథకాలు చూసి ప్రజలు బి ఆర్ ఎస్ పార్టీ వైపు మొగ్గు చెబుతున్నారని కాంగ్రెస్ పార్టీ మరియు బిజెపి పార్టీ ఎన్ని జిమ్మిక్కులు చేసిన కేసీఆర్ గారికి ఓడించడం కష్టమని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మహబూబాబాద్ నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీతో బానోత్ శంకర్ నాయక్ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సోషల్ మీడియా వైస్ ప్రెసిడెంట్ పోలేపక రాజు , వర్కింగ్ ప్రెసిడెంట్ బానోత్ గణేష్ , బిఆర్ఎస్ నాయకులు రాజు నాయక్ , భీమా నాయక్ , అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న తరుణ్ నాయక్

