కేసిఆర్ నేతృత్వంలోని బిఆరెస్ పాలనలోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు.మంగళవారం ఎమ్మెల్యే స్వగృహంలో పలువురు వ్యక్తులు వివిధ పార్టీల నుండి బిఆరెస్ పార్టీ లో చేరగా వారికి కండువా కప్పి సాధరంగా ఆహ్వనించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే ఏకైక పార్టీ బిఆరెస్ అనీ ,ఎలాంటి ఆపదకలిగినా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని ,ఏ సమయంలో నైనా అందరికీ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే అన్నారు.క్షేత్ర స్థాయిలో నాయకులు ఎలాంటి పొరపచ్చాలు లేకుండా సమిష్టిగా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని అన్నివర్గాల ప్రజలను కలుపుకుని పోవాలని ,కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ ను ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి ని చేసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ పథకాలకు ఆకర్షితులై పడమటిగూడెం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఓర్సు రమేష్ ,ఎర్పుగొండ సోమయ్య, గుగులోత్ తేజ నాయక్,కొండ వెంకన్న, వెలిశాల యాకన్న,మహిబూబ్ పాషా తదితరులు వారి కుటుంబం సభ్యులతో సహా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పడమటిగూడెం గ్రామ పార్టీ అధ్యక్షుడు చిమ్ముల వెంకట రెడ్డి , మండల పార్టీ ఉపాధ్యక్షుడు పాతూరి రమేష్ రెడ్డి ,యూత్ ప్రధాన కార్యదర్శి మంచాల శ్రీశైలం ,గ్రామ ఎంపీటీసీ పాతూరి మధు రెడ్డి , మరియు భారసా ముఖ్య నాయకులు మాజీ సర్పంచ్ మేకల వెంకన్న, జొన్నగడ్డ వెంకన్న ,కుంభాల లింగయ్య ,అక్కిరెడ్డి వెంకటరెడ్డి, భూక్య వీరు నాయక్ ,దారం వేదయ్య, పాతూరి వెంకట్ రెడ్డి, దాసరోజు ఈశ్వర చారి, పాతూరి అనంతరెడ్డి, ఆనంద్, పుల్లయ్య కుంబాల మహేందర్ , ఆలువాల కుమార్ ,ఏర్పుగొండ రవి ,ఎస్ కే సాదిక్, చిదిమిల్ల క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

