సామాన్యులకు అమ్మలా అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని , రాబోయేది కాంగ్రెస్ పాలనేనని ,పార్టీలో చేరిన కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటామని ఇల్లందు కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య అన్నారు. ఇల్లందు నియోజకవర్గంలో నామినేషన్ లు ముగిసిన అనంతరం రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి.ఈ నేపథ్యంలో శనివారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట గ్రామపంచాయతీ లో నాయకులు భూక్య ప్రవీణ్ నాయక్ ఆధ్వర్యంలో ఇతర పార్టీల నుండి సుమారు 40 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రంగు సారయ్య, బుర్ర శంకరయ్య ,చింతనూరి భాస్కర్, చిర్రా చంద్రయ్య, బుర్ర ఉపేందర్, రంగు నాగేశ్వరరావు, గట్టు రఘుపతి, కెక్కెర్ల రాజయ్య, గట్టు శ్రీను, దేశినేని శీను, తాళ్లపల్లి శ్రీను, దేశినేని రాంబాబు, రంగు వెంకటరాజా, కొండ బిక్షపతి, కేశగానే అప్పయ్య ,చింతలూరి వీరన్న, బుర్ర సత్యనారాయణ భూంపల్లి శీను , దేశినిఅశోక్, చింతనూరు వెంకన్న, పిల్లల మల్లికార్జున్ ,దేశినేని సాంబయ్య, రంగు రామదాసు ,దేశనేని నాగేష్, బుర్ర శ్రీను ,రంగు సంతోష్, వల్లాల అనిల్ ,చిర్ర సాంబయ్య, నారగోని హుస్సేన్, చామకూరి రాంబాబు ,ఎం ప్రకాష్ పిల్లలు నరేష్, కెక్కెర్లకోటేష్ లకు కనకయ్య పార్టీ కండువాలను కప్పి సాధారంగా ఆహ్వనించారు. పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రాబోయేది కాంగ్రెస్ పార్టీయే... కార్యకర్తలకు అండగా ఉంటాం:కోరం కనకయ్య
November 11, 2023
0
(నమస్తే మానుకోట-బయ్యారం)
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

