ఉద్యమకారులంతా కాంగ్రెస్ గెలుపుకై కృషి చేయాలి
-టిఆరెస్ వెంకన్న.
●ఉద్యమ కారులను నట్టేట ముంచిన కేసీఆర్.
●ఈ ఎన్నికల్లో వారికి బుద్దిచెప్పాలి.
●మలిదశ ఉద్యమకారులంతా కాంగ్రెస్ తో కలిసి రావాలి.
(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
ఉద్యమఅరులను,నట్టేట ముంచి ఏనాడు పట్టించుకోని సిఎం కేసీఅర్, డోర్నకల్ ఎమ్మెల్యే డి.ఎస్ రెడ్యా నాయక్ ను ఈ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని,దీనికి ఉద్యమకారులంతా కలసి రావాలని మలి దశ ఉద్యమకారుడు దర్మారపు వెంకన్న అలియాస్ టిఆర్ఎస్ వెంకన్న పిలుపునిచ్చారు. మంగళవారం టిఆర్ఎస్ వెంకన్న తో పాటు 30 కుటుంబాలకు చెందిన ప్రజలు, పలువురు నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో డోర్నకల్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా దర్మారపు వెంకన్న మాట్లాడుతూ గడిచిన 10 యేండ్ల కెసిఆర్ పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని, డబుల్ బెడ్ రూం ఇవ్వలేదని, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదని,ఫీజు రీయిబర్స్ మెంట్ ఇవ్వలే, రైతు రుణమాఫీ చెయ్యలే ఇవ్వన్ని చేయని బిఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ఏమి చేయదని, ఉద్యమకారులను స్థానిక నాయకులు గాని, ఎమ్మెల్యే గాని ఎప్పుడు పట్టించుకున్న దాఖలాలు లేవని, గౌరవం ఇవ్వలేదని, వారి నియంతృత్వ పోకడలకు విసుగు చెంది కారు పోవాలి, కాంగ్రెస్ రావాలనే ఉద్దేశంతో పార్టీలో చేరామన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు భరోసా ద్వారా ఉచిత విద్యుత్, రు. 2 లక్షల రైతు రుణమాఫీ, ప్రతి ఏటా పట్టాదారులకు రు 15 వేలు, కౌలు రైతులకు రు. 12 వేలు,జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అను సంధానం చేసి వ్యవసాయాన్ని పండుగ చేస్తుందని, గృహ జ్యోతి పథకం ద్వారా మహిళలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తారని, మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు రు.2500, చేయూత పథకం ద్వారా వృద్దులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు, వికలాంగులకు, బీడీ కార్మికులకు ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ రు.4 వేలు పింఛను, యువ వికాసం ద్వారా విద్యార్థులకు ఫీజ్ రీ అంబర్సుమెంట్ అందించి పేద విద్యార్థులందరికీ ఉచిత ఉన్నత విద్యను అందిస్తుందన్న అరు గ్యారాంటీలతో పాటు, పార్టీలో రామచంద్రనాయక్ సముచిత స్థానా న్ని, గౌరవాన్ని కల్పిస్తామని ఇచ్చిన భరోసాతో పార్టీలో చేరామన్నా రు. పార్టీలో చేరిన వారు విశ్వబ్రాహ్మణ సంఘం నాయ కులు చంద్ర మౌళి,మాజీ వార్డు సభ్యులు తుర్పాటి వెంకన్న, వాసు, నాగ న్న, రత్నాచారి, ఉపేందర్, నరేష్ లతో పాటు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

