కాంగ్రెస్ తోనే నిరుపేదలకు న్యాయం:మాలతి రెడ్డి.
(నమస్తే మానుకోట-నర్సింహులపేట)
బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనేసాధ్యమని కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఎన్నికల్లో ఓటు వేసి డాక్టర్ రామచంద్రనాయక్ గెలుపులో భాగస్వామ్యం కావాలని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాలతి రెడ్డి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా నరసింహులపేట మండలంలోని పలు గ్రామాల్లో మాలతి రెడ్డి పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా యువ నాయకులు తోట సురేష్ నేతృత్వంలో కొమ్ముల వంచ గ్రామ శివారు దుబ్బతండా లో ప్రచారాన్ని నిర్వహించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కెసిఆర్ సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నాడని, ఉచిత పథకాల నీడన ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ మూడో తేదీ తర్వాత ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, డోర్నకల్ నియోజకవర్గం లో గెలిచేది రామచంద్రనాయక్ మాత్రమేనని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ ఇచ్చిన దళిత గిరిజనుల భూములను అభివృద్ధి పేరిట లాక్కున్నారని, ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ళను ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో కౌలు రైతులకు, మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించనున్నారని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నారని, రైతన్నలకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేయనున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లక్ష్మీనారాయణ ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజశేఖర్, పిఎసిస్ డైరెక్టర్ డొనికేని లక్ష్మయ్య, ఎస్.ఎం.సి చైర్మన్ గుండగాని లక్ష్మయ్య నాయకులు ,గుద్దేటి శంకర్ ,గడ్డం విజయ్ ,అమీర్ పాషా,గడ్డం విజయ్ ,మైదం మల్లయ్య ,డొనికెని ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

