రెడ్యా తోనే అభివృద్ధి-మళ్ళీ గెలిపిద్దాం:నూకల గౌతమ్ రెడ్డి
(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
బిఆర్ఎస్ పార్టీ డోర్నకల్ నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి డిఎస్ రెడ్యా నాయక్ ను మళ్ళీ గెలిపించాలని కోరుతూ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు జిల్లా పార్టీ నాయకులు నూకల గౌతమ్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు ధర్మారపు వేణు అధ్వర్యంలో బొడ్లాడ సర్పంచ్ సుష్మా గౌడ్ తో కలసి బుదవారం తూర్పు తండాలో గడపగడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు.ప్రభుత్వ పథకాలను,అభివృద్ధిని చూపిస్తూ ఓటును అభ్యర్ధించారు.కారు గుర్తుకు ఓటు వేసి రెడ్యాని గెలిపించాలని కోరారు.ఈ సందర్బంగా గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ రెడ్యానాయక్ కారు గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపిస్తే ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తారని,ప్రతిపక్షాలు కాంగ్రెస్,బిజెపిలు చెప్పే మాయ మాటలను విని ప్రజలు మోసపోవద్దని అన్నారు.కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు పిటి వెంకన్న, ఉపాధ్యక్షులు భానుచందర్, సీనియర్ నాయకులు రాములు,రవి,రమేష్,ఎస్టీ సెల్ అధ్యక్షులు పోటీయా,బద్రు,సోమన్న,వెంకన్న,ఆగపేట గ్రామ పార్టీ అధ్యక్షుడు గడ్డం వెంకన్న, యాకూబ్,మురళి బిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


