(నమస్తే మానుకోట-తొర్రూరు)
తొర్రూర్ మండలంలోని గుర్తూర్ మోడల్ స్కూల్ హస్టల్ ని వెంటనే ప్రారంభించాలని ఎస్,ఎఫ్,ఐ జిల్లా అధ్యక్షుడు పట్ల మధు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా మంగళవారం ఎస్ఎప్ఐ మండల కమిటీ ఆద్వర్యంలో ఎమ్మార్వో కార్యలయంలో డిప్యూటీ తహసీల్దారు నర్యయ్య కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ దాదాపు విద్యా సంవత్సరం ప్రారంభమై 8 నెలలు గడుస్తున్నా విద్యా శాఖ అధికారులు మొద్దు నిద్ర పోతున్నారని ఆ హస్టల్ లో సరైన సౌకర్యాలు కూడా లేవు అని అన్నారు..జిల్లాలో చాలా మోడల్ స్కూల్ హస్టల్ ల పరిస్థితి ఇలాగే ఉందని అన్నారు..విద్యార్థులు రోజు వెళ్లిరావాడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లాలో విద్యా శాఖ అధికారులు మోడల్ స్కూల్ హస్టల్ ల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు మోస్ చార్జీలు పెంచకపోవడం వలన వారికి నాణ్యమైన భోజనం అందడం లేదని అన్నారు..కావున దీని పై విద్యా శాఖ ఉన్నతాధికారులు స్పదించి,గుర్తూర్ మోడల్ స్కూల్ హస్టల్ తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ తొర్రూర్ మండల నాయకులు ప్రసాద్,చరణ్,నవీన్,మహేష్,వినయ్ తదితరులు పాల్గొన్నారు.

