(నమస్తే మానుకోట-దంతాలపల్లి)డోర్నకల్ నియోజకవర్గంలో నామినేషన్ లు ముగిసిన అనంతరం రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. గత 40 ఏళ్లుగా సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్న రాజకీయ భీష్ముడు డిఎస్ రెడ్యానాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్న బిఆర్ఎస్ పార్టీని వీడి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్ తో ప్రచారంలో పాల్గొన్న స్థానిక పార్టీ నాయకులు కారు దిగి ,చెయ్యందుకుంటున్నారు. కాగా ఎన్నికలు తనకు చివరి వని ఈ ఒక్కసారి ఓటు వేసి గెలిపించాలని డిఎస్ రెడ్యానాయక్ ప్రచారంలో దూసుకుని పోతుండగా, మరోవైపు రెడ్యా నాయక్ పై ,గత రెండు పర్యాయాలు ఓటమిపాలైన డోర్నకల్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రామచంద్రనాయక్ ఈసారి గత నాయకులకు రెస్ట్ ఇచ్చి ఇంటికి పరిమితం చేయాలని, కాంగ్రెస్ పార్టీకి చెయ్యి అందించి చేయూతనివ్వాలని తనదైన శైలిలో ప్రచారంలో దూకుడు పెంచారు. కాగా డోర్నకల్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైన బిజెపి, బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య పోటీ నెలకొన్నా ,తాజా పరిస్థితులు కాంగ్రెస్-బిఆర్ఎస్ మధ్య నీదా-నాదా అనీ హోరా ,హోరిగా ప్రచారం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దంతాలపల్లి ,నరసింహులపేట, మరిపెడ, కురవి మండలాల్లో డాక్టర్ రామచంద్రనాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా దంతాలపల్లి మండలానికి చెందిన పెద్ద ముప్పారం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు గుర్రం యాకయ్య 200 మంది కార్యకర్తలతో కారు దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం ఎమ్మెల్యే డి ఎస్ రెడ్యానాయక్ తో గ్రామంలో ప్రచారంలో పాల్గొన్న యాకయ్య శనివారం బిఆర్ఎస్ పార్టీని వీడి , కాంగ్రెస్ పార్టీ లో lచేరడంతో ఉమ్మడి నరసింహలపేట మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నూతనంగా పార్టీలో చేరిన నాయకులకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి డాక్టర్ రామచంద్రనాయక్ సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా యాకయ్య మాట్లాడుతూ గీతకార్మికుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ,గీత కార్మికుల సమస్యల సాధనకు గత కొన్నేళ్లుగా పోరాడుతున్నామని దానిలో భాగంగా రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీలో చేరామని ఎవరిపై కోపాలు లేవని తెలిపారు.
'కారు' దిగి 'చెయ్యం'దుకున్న బిఆరెస్ నాయకులు.
November 11, 2023
0
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

