(నమస్తే మానుకోట-దంతాలపల్లి)బిచ్చగాళ్ళను చట్టసభల్లోకి పంపిన ఘనత బీఎస్పీ పార్టీ దేనని, ఎన్నికల్లో ఏనుగు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని బిఎస్పి డోర్నకల్ అభ్యర్థి ని గుగులోతు పార్వతి రమేష్ కోరారు. ఈ సందర్భంగా శనివారం దంతాలపల్లి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్వతి స్థానికంగా ఉన్న ప్రజలను కలిసి ఓటు వేయాలని అభ్యర్థించారు. స్థానిక అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం మాట్లాడుతూ దేశ సంపదను అన్ని వర్గాలకు సమానంగా పంచేది కేవలం ఓటు హక్కు మాత్రమేనని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చూచించారని , అంబేద్కర్ ఆశయ సాధనకు డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు ఏనుగు గుర్తుపై ఓటు వేసి తన గెలుపుకు కృషి చేయాలని అన్నారు.బహుజన రాజ్యం వస్తె జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ లు అమలు చేస్తామని అన్నారు. డోర్నకల్ నియోజకవర్గం విద్య వైద్యం ఉపాధిలో వెనుకబడి ఉందని బిఎస్పి అధికారంలోకి వస్తే నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేలా కృషి చేస్తానని అన్నారు. స్థానికంగా ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్, ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ రావు ,బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు ఉన్న డోర్నకల్ నియోజకవర్గం లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.ఈ కార్య క్రమం లో లైవ్ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ గుగులోత్ రమేష్ , బిఎస్పి జిల్లా ఇంచార్జి తగరం నాగన్న , జిల్లా సెక్రెటరీ అసెంబ్లీ ఇంఛార్జి ఐనాల పరశు రాములు, జిల్లా ఇసి మెంబర్ ఎడ్ల రెడ్డి శ్రీనివాస్ , నియోజక వర్గ మహిళ కన్వీనర్ దర్శనాల మమత, మండల అధ్యక్షులు జనక కృష్ణ మూర్తి , లింగా నాయక్, స్వేరో నాయకులు తదితరులు పాల్గొన్నారు.



