(నమస్తేమానుకోట-తొర్రూరు):పాలకుర్తి ప్రజలు మార్పు కోరుతున్నారని, ఎర్రబెల్లి పర్వతగిరికి పారాచూట్ రెడీ చేసుకోవాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు శనివారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో ఝాన్సీ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.చేరిన వారిలో బిఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దసాని సురేష్, నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షులు సాయి ముఖేష్, పట్టణ అధ్యక్షులు బసనబోయిన మురళి యాదవ్, ఎస్సీ సెల్ కార్యదర్శి అల్లం జంపా, యూత్ నాయకులు తూర్పాటి సంజు సాయి,సర్వి రాజేందర్,సర్వి నాగరాజు, బొమ్మరబోయిన హరీష్ లు ఉన్నారు.ఈ సందర్భంగా ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఊసరవెల్లి దయాకర్ రావు తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.పేదలకు భూములు ఇవ్వాలన్నా, ఇండ్లు కట్టించలన్నా, మన పొలాలకు నీళ్ళు రావాలన్నా,మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, పరిశ్రమలు ఏర్పాటు జరగాలన్నా రావాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు.9 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే పేదల జీవితాలను ఆగం చేశారని,అన్ని వర్గాల ప్రజలను మోసగించారని తెలిపారు.తెలంగాణ రాష్ట్రమిచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని, తొమ్మిది సంవత్సరాలలో చేయని అభివృద్ధి, ఐదు సంవత్సరాల్లో చేసి చూపిస్తామని ఆమె అన్నారు. కేసీఆర్ హయాంలో దళిత బందు ఇయ్యలే, బీసీ బందు ఇయ్యలే, గిరిజన బందు ఇయ్యలే,డబుల్ బెడ్ రూమ్ ఇయ్యలే, గృహలక్ష్మి ఇయ్యలే.. అన్నీ బంద్ చేసిన బీఆర్ఎస్ సర్కారును కూడా డిసెంబర్ 30 తేదీన బంద్ చేద్దామని ఆమె కోరారు. రాబోయే ఎన్నికల్లో 25 రోజులు యశస్విని రెడ్డి గెలుపు కోసం కష్టపడితే ఐదేళ్లు సేవకురాలుగా పనిచేస్తుందన్నారు. ఎమ్మెల్యేగా వచ్చే వేతనాన్ని కూడా మీకే అంకితం చేస్తూ అభివృద్ధికి వెచ్చిస్తుందని,వచ్చే ఐదేళ్లు మీ అభివృద్ధి కోసం కష్టపడతుందని అన్నారు.రాబోయే ఎన్నికల్లో ఈ దగా దయాకర్ రావుని తరిమి కొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ గెలుపుకై ఒక సైనికులు లాగా పనిచేయాలనీ ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్, నాయకులు బిజ్జాల వరప్రసాద్, ఎన్ఎస్ యుఐ పాలకుర్తి నియోజకవర్గం అధ్యక్షుడు బసనబోయిన రాజేష్ యాదవ్, యూత్ నాయకులు బసనబోయిన వినోద్ కుమార్,తూర్పాటి రాంబాబు,చర్లపెళ్లి రవిశంకర్, అభి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

