(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మిరప పంటలకు సస్య రక్షణ చర్యలు తీసుకోవాలని వాటిపై అవగాహన పెంపొందించుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి సందీప్ ,దీక్షిత్ కుమార్ అన్నారు.ఈ సందర్భంగా దంతాలపల్లి మండలంలోని పెద్ద ముప్పారం వేములపల్లి గ్రామాల్లోని మిరప పంటలను పరిశీలించి సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ పంటలో ఆకు ముడత తెగులు (జెమినీ వైరస్) ను గుర్తించారు., ఈ తెగులు సోకిన మొక్కలు ముడుచుకుపోయి ఉంటాయని మొక్కలు గిడసభారీ పోయి ఎదుదల క్షీణిస్తుందని తొలి దశలో గుర్తించి సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే పంటను కాపాడుకోవచ్చునని రైతులకు సూచించారు.ముందుగా వైరస్ ను వ్యాప్తి చెందించే క్రిముల స్థావరాలు అయిన కలుపు మొక్కలను పీకి శుభ్రంగా ఉంచుకోవాలని. తొలి దశలో వైరస్ లక్షణాలు గల మొక్కలను గుర్తించి నాశనం చేయాలని అన్నారు. అనంతరం పంటలలో ఆకుముడత కనిపించిన వెంటనే వేప నూనె (1500 పిపిఎం) 5 ఎమ్మెల్ కల్పి పిచికారీ చేయాలని జెమినీ వైరస్ ను వ్యాప్తి చేసే తెల్ల దోమల నివారణకు పంటలో పసుపు రంగు జిగురు అట్టాలు మరియు నీలి రంగు జిగురు అట్టలు ఎకరానికి 30 నుంచి 40 వరకు పెట్టాలి. మొక్క దృఢంగా పెరగడానికి పై పాటగా పొటాషియం నైట్రేటు, 13-0-45 లేదా 19-19-19 వంటి పోషకాలను మొక్క వయసు ఆధారంగా 5 నుంచి 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలని అలాగే రసం పీల్చే పురుగులైన తెల్ల దోమ నివారణకు 5 శాతం వేప గింజల కషాయం మరియు సస్యరక్షణ మందులైన ఫైరీప్రోక్సిపెన్ లేదా పెన్పొప్రోత్రిన్ 0.34 ఎమ్మెల్ లీటర్ నీటి కలిపి చేయాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి సందీప్ మరియు దీక్షిత్ కుమార్,రైతులు పాల్గొన్నారు.


